Switch to English

ఎన్టీయార్ రగడ.! తమ్ముడు మోహన్‌బాబు ఎక్కడ.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘అన్నయ్య పిలిస్తేనే రాజకీయాల్లోకి వెళ్ళాను.. అన్నయ్య నన్ను సొంత తమ్ముడిలా, సొంత బిడ్డలా చూసుకునేవారు..’ అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి సినీ నటుడు మోహన్‌బాబు చెప్పే ప్రవచనాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘మహానుభావుడు, మహనీయుడు.. ఆయనకి ఆయనే సాటి.. ఎప్పుడూ ఆయన మాట జవదాటను.. నా తర్వాత డైలాగులు అంత బాగా నువ్వే చెబుతావంటూ నన్ను ఆయన పొగిడేవారు..’ ఇలా సాగుతుంటుంది మోహన్‌బాబు ప్రవచనాల పర్వం స్వర్గీయ ఎన్టీయార్ గురించి.

ఏరీ ఎక్కడ.? మోహన్‌బాబు ఎందుకు, స్వర్గీయ ఎన్టీయార్ విషయమై ఇప్పుడు కనీసం ఓ ప్రకటన అయినా విడుదల చేయలేదు.? వైసీపీ నేత, మంత్రి దాడిశెట్టి రాజా ఏకంగా స్వర్గీయ నందమూరి తారకరామారావుని రాజకీయాల్లో చేతకానివాడిగా అభివర్ణించారాయె. అసలు వైఎస్సార్‌కీ ఎన్టీయార్‌కీ పోలికే లేదంటారాయన. వైసీపీ ప్రభుత్వం, స్వర్గీయ ఎన్టీయార్ పేరుని హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించిందాయె.

ఇంత జరుగుతున్న సినీ నటుడు మోహన్‌బాబు, స్వర్గీయ ఎన్టీయార్ తరఫున వకాల్తా పుచ్చుకోవడం చేయలేదు సరికదా.. కనీసం, ఓ చిన్న మాట కూడా మాట్లాడలేకపోయారు.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చొద్దనీ.. ఆ ఎన్టీయార్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయొద్దని. మోహన్‌బాబు కూడా వైసీపీ నాయకుడే కదా.? 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేశారు కదా.?

అదంతే, అది రాజకీయం. ‘ఏకగర్భమున పుట్టకపోయినా మనిద్దరం అన్నదమ్ములం..’ అని స్వర్గీయ ఎన్టీయార్, మోహన్‌బాబు గురించి చెప్పారట. ఆ ఎన్టీయారే తనను రాజ్యసభకు పంపారనీ మోహన్‌బాబు ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు. ప్చ్.. ఎన్టీయార్ వల్ల అందరూ పదవులు పొందినవారే.. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగినవారే. కానీ, ఈ రోజు ఎన్టీయార్ తరఫున గట్టిగా మాట్లాడేవారే లేకుండా పోయారు.

‘నేను నిప్పులాంటి మనిషిని..’ అని చెబుతుంటారు మోహన్బాబు. తప్పుని, తప్పని నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం తనకుందని కూడా చెప్పే మోహన్‌బాబు, ఇప్పుడెందుకు మౌనం దాల్చారబ్బా.? అన్న చర్చ అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది. ఎన్టీయార్ పేరుని వాడుకుని, రాజకీయంగా అలాగే ఆర్థికంగా ఎదిగిన చాలామంది, ఆ ఎన్టీయార్ పేరు మీద జరుగుతున్న రాజకీయ దాడిపై స్పందించకపోవడం ఆవ్చర్యకరమే మరి.!

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

రాజకీయం

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

ఎక్కువ చదివినవి

కమెడియన్‌నే..! పొలిటికల్ కమెడియన్‌ని కాదు.!

సినీ నటుడు, రచయిత ‘జబర్దస్త్’ కమెడియన్ హైపర్ ఆది, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నెల రోజులపాటు సినిమా...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా (కోవిడ్...

కడపలో వైసీపీకి షర్మిల డ్యామేజ్.! వర్ణనాతీతమే.!

‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...