జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ కలెక్షన్ల పరంగా బాగానే వసూలు చేస్తోంది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. ఎన్టీఆర్ కు బూస్ట్ ఇస్తోంది. ఆయన కెరీర్ లో రాజమౌళితో కాకుండా చేసిన సినిమాల్లో ఇదే ఎక్కువ వసూళ్లు సాధించింది. అయితే తాజాగా దేవర మూవీ మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ మూవీ తెలంగాణ, ఏపీలోని చాలా ఏరియాల్లో రోజూ కోటికి పైగా వసూలు చేసినట్టు చెబుతున్నారు మూవీ మేకర్స్.
ఇక సీడెడ్ లో అయితే ఏకంగా రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందంటున్నారు. సీడెడ్ లో త్రిబుల్ మూవీ తర్వాత ఎన్టీఆర్ మూవీ ఇంత వసూలు చేసిందంటే అది దేవరనే. ఒక హీరో రెండు సినిమాలు ఇంతగా వసూలు చేస్తుందంటే కేవలం ఎన్టీఆర్ కే అది సాధ్యం అయిందని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా కలెక్షన్లు ఆగట్లేదు. ఇక ఇప్పటి వరకు మూవీ మొత్తం రూ.510 కోట్లకు పైగా రాబట్టిందని చెబుతున్నారు మూవీ మేకర్స్. ఇప్పట్లో పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. దేవరకు మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది.
క్రిస్మస్ దాకా పెద్ద సినిమాలు లేవు కాబట్టి లాంగ్ రన్ లో ఇంకో వంద కోట్లకు పైగా వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఏదేమైనా దేవర మూవీకి మంచి కలెక్షన్లు రావడం వల్ల ఎన్టీఆర్ మార్కెట్ మరింత పెరుగుతుందనే చెప్పుకోవాలి. త్రిబుల్ ఆర్ తో వచ్చిన మార్కెట్ ను ఆయన ఈ మూవీతో కాపాడుకున్నట్టే అంటున్నారు.