నందమూరి కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటించారు. తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. మళ్లీ ఎప్పుడు మిమ్మల్ని కలుస్తానో తెలియదు. కాస్త ప్రశాతంగా మాట్లాడనివ్వండి. ఈ సినిమాను రీసెంట్ గానే చూశాను. చూస్తున్నంత సేపు అలాగే చూడాలనిపించింది. విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా లేదు. కల్యాణ్ రామ్ అన్న లేకపోతే ఈ మూవీ లేదు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం లేకపోతే ఈ మూవీ లేదు. వాళ్లు ఈ మూవీ కోసం ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది’ అంటూ తెలిపాడు.
‘ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఈ మూవీ క్లైమాక్స్ లో చివరి 20 నిముషాలు చూస్తే ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు ఆగవు. అంత ఎమోషనల్ గా తీశారు దీన్ని. చూసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా గుర్తుండిపోతుంది. ఇంత అద్భుతమైన సినిమా చేసిన మూవీ యూనిట్ కు నేను అభినందనలు తెలుపుతున్నాను. కల్యాణ్ రామ్ అన్న ఈ సినిమాతో మీరు కాలర్ ఎగరేయాలి. విజయశాంతి గారు మాట్లాడుతుంటే ఈ రోజు మా నాన్న గారు లేరు అనే లోటు తీరిపోయినట్టు అనిపించింది. ఆమె మా నాన్న స్థానంలో ఈ రోజు మాట్లాడారు. ఈ సినిమాలో మా నాన్న నటిస్తే ఎలా ఉంటుందో ఆమె నటిస్తే అలాగే అనిపించింది. అందరూ జాగ్రత్తగా వెళ్లండి. ఈ సినిమాను ఏప్రిల్ 18న థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు జూనియర్.
ఈ మూవీని అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు కలిసి నిర్మించారు.
