NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ దేవర. ఈ సినిమాను రెండు పార్ట్ లుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మొదటి పార్ట్ ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లుగా కూడా ప్రకటన వచ్చింది.
అక్టోబర్ లో పలు సినిమాలు రాబోతున్న నేపథ్యంలో దేవర సినిమా మేకర్స్ ఆలోచనలో పడ్డారని, పైగా షూటింగ్ పూర్తి అవ్వడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది కనుక సినిమా వాయిదా వేసే ఉద్దేశ్యంతో నిర్మాతలు ఆలోచనలు చేస్తున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతుంది.
ఈ విషయమై దేవర మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది. రిలీజ్ విషయంలో వస్తున్న పుకార్లను వారు కొట్టి పారేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 10న దేవర సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. షూటింగ్ ను జులై లేదా ఆగస్టు వరకు పూర్తి చేసే విధంగా దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ హిందీలో వార్ 2 లో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే ఏడాది లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా సినిమా ప్రారంభం అవ్వబోతుందట.