Switch to English

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నారా లోకేష్‌ పెట్టిన ట్వీట్‌ సృష్టించిన రికార్డుల సారాంశమిది. నారా లోకేష్‌ ట్వీట్‌ రికార్డు స్థాయిలో 8,500 రీట్వీట్లు పొందింది. మరోపక్క, 17,000కి పైగా లైక్‌లు లభించాయి నారా లోకేష్‌, ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వేసిన ట్వీట్‌. ఎలా.? ఇదెలా సాధ్యమైంది.? అంటూ టీడీపీ వర్గాల్లోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

యంగ్‌ టైగర్‌ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన అభిమానులు ఓ యజ్ఞమే చేశారు సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డ్‌ సృష్టించేందుకోసం. ఈ క్రమంలో ఎవరు ఎన్టీఆర్‌కి బర్త్‌ డే విషెస్‌ చెప్పినా, దాన్ని రీ-ట్వీట్‌ చేయడం, లైక్‌ చేయడం వంటివి చేశారు. ఆ కోణంలో చూస్తే, నారా లోకేష్‌ ట్వీట్‌ సాధించిన ప్రత్యేకమైన ఘనత ఏదీ లేదన్నది సినీ పరిశ్రమలో జరుగుతున్న చర్చ.

ఇక, రాజకీయాల్లో ఇంకోరకమైన చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్‌ పేరు చెబితే తప్ప, నారా లోకేష్‌ ట్వీట్స్‌ని పెద్దగా ఎవరూ పట్టించుకోరనీ, చంద్రబాబు వెంటనే లోకేష్‌ని పక్కకు తప్పించి, ఎన్టీఆర్‌ని బతిమాలుకుని పార్టీని బాగు చేసుకోవాలనీ టీడీపీలోని స్వర్గీయ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారు.

గతంలో యంగ్‌ టైగర్‌, టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే. అయితే, దాన్ని రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత ఎన్టీఆర్‌ని పూర్తిగా పక్కన పడేసిన విషయం విదితమే. యంగ్‌ టైగర్‌ ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా వున్నాడు. ఆయనకి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేకపోబట్టి చంద్రబాబు ఆటలు చెల్లుతున్నాయి.

ఒకవేళ యంగ్‌ టైగర్‌ గనుక, రాజకీయాల గురించి ఆలోచిస్తే.. టీడీపీ మొత్తం ఆయన వైపు వెళ్ళిపోవడం ఖాయమని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోందట. చాలామంది సీనియర్లే కాదు, యంగ్‌ జనరేషన్‌ పొలిటికల్‌ లీడర్స్‌ కూడా చంద్రబాబుపై ఎన్టీఆర్‌కి సంబంధించి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు గత కొంతకాలంగా. కానీ, చంద్రబాబు లెక్కలు వేరేలా వున్నాయ్‌. ఆ లెక్కలే ఇప్పుడు టీడీపీని ఈ స్థాయికి దించేశాయ్‌.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

‘సమంత’ ఏమంత అందగత్తె కాదు.. బుట్టబొమ్మకు షాకిచ్చిన హ్యాకర్లు

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ కు గురయ్యింది. టెక్నికల్ టీం సాయంతో మరలా ఆ అకౌంట్ ను పునరుద్ధరించారు. ఈ విషయాన్ని అర్ధరాత్రి 12.37 గంటలకు ట్విటర్ వేదికగా నెటిజన్లకు...

ఫ్లాష్ న్యూస్: తల్లి శవంను రోడ్డున పడేసిన కొడుకు

వృద్యాప్యంలో తమకు తోడుగా ఉండి, చనిపోయిన సమయంలో దహన సంస్కారాలు చేస్తారనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరు కూడా కొడుకో లేదంటే కూతురు కావాలని కోరుకుంటారు. కాని మంగళగిరికి చెందిన ధనలక్ష్మి అనే అభాగ్యురాలు...

లెక్చరర్ కీచక పర్వం – యువతులను బ్లాక్ మెయిల్.. ఆపై.!

పెద్ద చదువు.. మంచి ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. వృత్తిపరంగా లెక్చరరే అయినా.. ప్రవృత్తి మాత్రం అమ్మాయిల జీవితాలతో ఆడుకోవడం. లెక్చరర్ గా పనిచేస్తున్న ఓ కీచకుడు చేస్తున్న వ్యవహారం ఇది. తాను పాఠాలు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...