రేపు చరణ్ బర్త్‌డే సందర్బంగా జక్కన్న ఆర్ఆర్ఆర్ నుండి ఏమైనా సర్ప్రైజ్ వీడియో కాని పోస్టర్ కాని విడుదల చేస్తాడా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో జక్కన్న ఫ్యాన్స్ మైండ్ బ్లాంక్ అయ్యేలా ట్విస్ట్ ఇచ్చాడు. ఫ్యాన్స్ మద్య రచ్చ లేకుండా రామ్ చరణ్ బర్త్‌డేకు ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. రేపు ఉదయం 10 గంటలకు భీమ్ వీడియోను రామరాజు బర్త్‌డే సందర్బంగా విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
రామ్ చరణ్ బర్త్‌డే సందర్బంగా భీమ్ వీడియో రాబోతుందని లాక్ డౌన్ కారణంగా చరణ్ బర్త్‌డేను భారీగా అనుకున్నా ఇలా డిజిటల్ రూపంలో సెలబ్రేట్ చేసుకోబోతున్నట్లుగా ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ విషయంపై చరణ్ స్పందిస్తూ వావ్ ట్విట్టర్లో నేను కరెక్ట్ టైంకు జాయిన్ అయ్యాను. లేదంటే ఇలాంటి మంచి సర్ప్రైజింగ్ వీడియోను మిస్ అయ్యేవాడినేమో అంటూ ఎన్టీఆర్ ట్వీట్‌కు రీ ట్వీట్ చేశాడు.
ఫ్యాన్స్ మద్య ఎలాంటి రచ్చ లేకుండా ఉండేలా జక్కన్న ఈ ప్లాన్ చేశాడు. మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే ఉంటుంది. అప్పుడు చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియోను జక్కన్న విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా ఫ్యాన్స్ మద్య బ్యాలన్స్‌ను జక్కన్న మెయింటెన్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయంను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
Bro @AlwaysRamCharan, I wish I could've celebrated your birthday under better circumstances. But since we're under a lockdown & because staying home is important,I'm giving you a digital surprise at 10am tomorrow. Trust me,this is a bang you won't ever forget #BheemforRamaraju pic.twitter.com/Xq13wBBXOY
— Jr NTR (@tarak9999) March 26, 2020
916749 863805I surely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 100340
93045 537969I dugg some of you post as I cogitated they were really beneficial invaluable 922260