Switch to English

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల తీవ్రత క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మహారాష్ట్ర సంగతి సరే సరి. తెలంగాణ విషయానికొస్తే, గ్రేటర్‌ హైద్రాబాద్‌ మినహా తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కరోనా దాదాపుగా అదుపులోకి వచ్చేసింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఒకటీ అరా కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసులు కొంత ఆందోళనకరంగానే వున్నా, దేశంలోని ప్రధాన నగరాలతో పోల్చితే హైద్రాబాద్‌ చాలా బెటర్‌.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగానే వుంటోంది చాలా కాలంగా. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణా పునఃప్రారంభమయన దరిమిలా.. రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య ముందు ముందు ఎలా వుండబోతోందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. అయితే, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్పÛలితాలిస్తున్నాయనీ, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దేశంలోని చాలా ఇతర రాష్ట్రాలతో పోల్చితే కాస్త మెరుగ్గానే వుందని కేంద్రం కూడా చెబుతుండడం గమనార్హం. అయితే, తెలంగాణలో టెస్ట్‌ల సంఖ్య తక్కువగా వుండడం రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అదే సమయంలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసుల సంఖ్య విషయమై గందరగోళం నెలకొందన్న రాజకీయ విమర్శల్ని చూస్తున్నాం. రాజకీయ రగడ సంగతి పక్కన పెడితే.. రానున్న రోజుల్లో కరోనా, తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టి, పూర్తిగా అదుపులోకి వచ్చేలానే కన్పిస్తోంది. ఇదిలా వుంటే, దేశంలోని ప్రధాన నగరాల మధ్య విమానయానం షురూ కానున్న దరిమిలా.. కరోనా వైరస్‌ కేసులు పెరిగే అవకాశముందనీ, తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుదల వుండొచ్చన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.

ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా వున్నామంటూ ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు కొంత భరోసా ఇచ్చేలానే వున్నా, కరోనా వైరస్‌ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సృష్టించిన భయాందోళనల నేపథ్యంలో.. ప్రజలు మాత్రం ముందు ముందు ఇంకెలాంటి ఉపద్రవం చూడాల్సి వస్తుందోనన్న ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఇక, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల విషయానికొస్తే, నాలుగైదు రోజుల్లోనే మొత్తం కేసుల సంఖ్య లక్షన్నర దాటే అవకాశం వుంది. గత రెండు మూడు రోజులుగా సగటున రోజుకి 6 వేల పైన కేసులు నమోదవుతున్నాయి.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

భయపెడుతున్న ‘నిసర్గ’ తుఫాన్‌

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి నైరుతి దిశగా కదులుతోంది. ఈ తుఫాన్‌తో మహారాష్ట్ర, గుజరాత్‌లతో పాటు పలు రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటూ వాతావరణ శాఖ పేర్కొంది. తుఫాన్‌...

జగన్ కాళ్ళు చంద్రబాబు పట్టుకోవాలి- వైకాపా మాజీ ఎమ్మెల్యే ఫైర్ !

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ మరోసారి సారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్...

కరోనా టైంలో సైలెంట్ గా వ్యభిచారం చేస్తున్నారు.. ఎక్కడో తెలుసా??

ప్రస్తుతం దేశం లాక్ డౌన్ లో ఉంది. కరోనా భయంతో వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. ప్రజలు భయపడుతూనే ఇళ్లలోంచి బయటకు వస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరినీ తాకకుండా జాగ్రత్తలు వహిస్తున్నారు. దగ్గు,...

ప్రేయసి కోసం ప్రియుడు.. అమ్మాయి వేషంలో వెళ్లి..

‘దేశంలో లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి.. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోయాయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కార్మికులు పనుల్లేక అవస్థలు పడ్డారు..’ ఇవే మనం చూశాం. కానీ.. లాక్ డౌన్ వల్ల ప్రేమికులు...

బ్రేకింగ్ న్యూస్: నల్గొండలో భారీ పవర్ ప్లాంట్ బ్లాస్ట్.!

గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీని వలన తాజాగా తెలంగాణ, నల్గొండ జిల్లా, నార్కెట్ పల్లి...