టీచర్ల పాత్ర కీలకం: మంత్రి నారా లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,484FansLike
57,764FollowersFollow

ప్రభుత్వ విద్యను దేశంలో ఆదర్శంగా నిలిపేందుకు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ముఖ్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను కలిశారు.

ఈ సందర్భంగా ఎంఈవో పోస్టుల్లో జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలంటూ, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ వారు వినతిపత్రం సమర్పించారు. అలాగే ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా జరిగాయని, కొత్తగా మోడల్ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని కలిగించిందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

నారా లోకేష్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇకపై జిల్లావారీ క్లస్టర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవుతానని తెలిపారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని, అంకితభావంతో పని చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.

ఈ కార్యక్రమంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోండూరు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి బొనిగెల హైమారావు, రాష్ట్ర క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ చెరుకూరి సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి జె. శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎమ్.రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సినిమా

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

రాజకీయం

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

పదవుల కోసం కాదు.. సమాజ మార్పు కోసమే జనసేన: పవన్ కళ్యాణ్

జనసేన పార్టీని కుటుంబ పార్టీగా కాకుండా సిద్ధాంతాలపై నడిచే శక్తివంతమైన రాజకీయ వేదికగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరిలో జరిగిన...

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఎక్కువ చదివినవి

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ఆంధ్రప్రదేశ్‌లో ‘నా దేశం నా బాధ్యత’.. చంద్రబాబు కొత్త కార్యాచరణకు సిద్ధం

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో “నా దేశం నా బాధ్యత” పేరుతో భారీ ప్రజా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వనరుల సంరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యంగా రూపొందిస్తున్న ఈ కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి...

Daily Horoscope: కన్య రాశివారికి ఉద్యోగంలో ప్రశంసలు.. ధనుస్సు రాశివారికి కొత్త పరిచయాలతో లాభాలు

మే 14 , 2026 గురువారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపించనుంది. కుటుంబ విషయాల్లో ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...