మంచు విష్ణు లీడ్ రోల్ లో నటిస్తూ నిర్మిస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబుతో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటించాడు. అక్షయ్ కుమార్ సినిమాలో శివుడిగా నటిస్తుండగా ప్రభాస్ రుద్ర పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉండటం వల్ల ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. ఐతే కన్నప్ప టీజర్ తో నెగిటివిటీ రాగా ఈమధ్య వచ్చిన శివయ్య సాంగ్ తో కాస్త బజ్ పెంచేలా చేశారు. ఐతే ఈ సినిమాలో నటించినందుకు గాను ప్రభాస్ ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుంది.
కేవలం ప్రభాస్ మాత్రమే కాదు మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా కన్నప్పలో నటించినందుకు పారితోషికం తీసుకోలేదట. ప్రభాస్ తన ఫ్రెండ్ విష్ణు కోసం అతనికి సపోర్ట్ గా కన్నప్పలో నటించినందుకు రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తుండగా మోహన్ లాల్ కూడా ఈ సినిమాలో తన రోల్ కోసం ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేశారట. మంచు విష్ణు కన్నప్పని భారీ బడ్ఝెట్ తో తెరకెక్కిస్తున్నారు. సినిమాను సమ్మర్ రిలీజ్ లాక్ చేశారు.
స్టార్స్ అందరినీ పర్ఫెక్ట్ గా వారి పాత్రలను వాడుకుని ఉంటే మాత్రం కన్నప్పకు స్టార్స్ తోనే క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ సీన్స్ పర్ఫెక్ట్ గా వస్తే మాత్రం రెబల్ స్టార్ ఫ్యాన్సే ఈ సినిమాను వారి భుజాన వేసుకుంటారని చెప్పొచ్చు.