పిల్లలపై రాజకీయ ప్రభావం లేకుండా ఉండాలని అన్నారు నారా లోకేష్. అందుకు తగినట్టుగా విద్యాశాఖలో మార్పులను తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల విద్య మీద రాజకీయ ప్రభావం లేకుండా చేస్తున్నారు. రాజకీయాలకు అసలు ఎలాంటి సంబంధం లేని విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబందించి లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాజకీయ సభలకు పిల్లలను తరలించడంపై నిషేధించిన లోకేష్ రాజకీయ నేతలు ఎప్పుడైనా స్కూళ్లకు వెళ్తే అభివృద్ధి పనుల కోసం తప్ప రాజకీయాలు కోసం వెళ్లకూడదని అన్నారు. ఇక పుస్తకాలు, యూనిఫాం లకు రాజకీయ గుర్తులు ఉండకూడదని అన్నారు.
గత ప్రభుత్వం ఇంట్లో సొమ్ము ఖర్చు పెట్టినట్టుగా ప్రతి పుస్తకానికి, వస్తువులపై జగన్ ఫోటో పెట్టించారు. పుస్తకాలు, బ్యాగులకు కూడా ఇలానే చేశారు. అంతేకాదు ప్రతీ వస్తువు వైసీపీ రంగులోనే ఉండేది. విద్యార్ధుల మనసుల్లో వైసీపీ ఉండాలని ఇలా చేశారు. రాజకీయ సభలకు పిల్లలను తీసుకెళ్లారు. పిల్లల భవిషత్తు కన్నా వారి భవిష్యత్తునే పణంగా పెట్టారని అన్నారు నారా లోకేష్.
నేటి పిల్లలు రేపటి దేశ బహ్విష్యత్తు.. పిల్లలు బాగుంటేనే దేశం భవిష్యత్తు బాగుంటుంది. పునాదులు గట్టిగా ఉంటేనే పిల్లలు కూడా ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. అందుకే పిల్లల విషయంలో మంత్రి నారా లోకేష్ పట్టుదలతో కనిపిస్తున్నారు. రాజకీయంగా పిల్లలను ఉపయోగించుకోవద్దని ఆయన అన్నారు.