Switch to English

సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదా.? ఇదేం పద్ధతి నాగ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,477FansLike
57,764FollowersFollow

‘నేను రాజకీయాలు మాట్లాడదలచుకోలేదు, మాట్లాడను..’ అనేస్తే, అదో లెక్క. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. నటుడు, నిర్మాత కూడా అయిన అక్కినేని నాగార్జున, నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమాకి ఎదురవుతున్న ఇబ్బందులపై ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ప్రభుత్వం చేసింది రైటేనని మాట్లాడొచ్చు.. లేదంటే, పరిశ్రమ పట్ల జగన్ సర్కార్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని కూడా అనొచ్చు. ఏదో ఒక అభిప్రాయమైతే ఆయన స్పష్టంగా చెప్పి తీరాలి.

చెప్పలేదు సరే, సినీ వేదికపై రాజకీయాలు మాట్లాడకూడదంటూ స్టేట్‌మెంట్ పాస్ చేసేస్తే ఎలా.? ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ఆ టీమ్ చాలా కష్టపడిందంటాడు.. ‘రాధేశ్యామ్’ సినిమా విడుదల వాయిదా పడటం బాధ కలిగించిందంటాడు. సినిమా టిక్కెట్ల ధరలు ఎక్కువ వుంటే, తన సినిమాకి ఎక్కువ వసూళ్ళు వస్తాయనీ.. తక్కువ ధరలు గనుక తక్కువ లాభాలు వస్తాయని చెబుతాడు.. పూర్తిగా గందరగోళం తప్ప కింగ్ నాగ్ మాటల్లో స్పష్టత లేదు.

అక్కినేని నాగార్జున గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. అంతకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుతోనూ సన్నిహిత సంబంధాలుండేవి. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సన్నిహితంగా వుంటున్నారు. అద్గదీ అసలు సంగతి.

సినిమా వేదికపై, సినిమా పరిశ్రమకు రాజకీయాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడటం తప్పెలా అవుతుందో అక్కినేని నాగార్జునకే తెలియాలి. కోవిడ్ కారణంగా సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు విడుదల కాలేదుగానీ, ఒకవేళ విడుదలయి వుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలతో ఆయా సినిమాలు తీవ్రంగా నష్టపోయేవే.

‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో ఏపీ సర్కార్ ఎంత ఇబ్బంది పెట్టిందనేది ఓపెన్ సీక్రెట్. ‘శ్యామ్ సింగారాయ్’ సినిమా మీద జగన్ సర్కారు కత్తి కట్టేసిన వైనం అందరికీ తెలిసిందే. పరిశ్రమ ప్రముఖుల్లో ఒకరిగా నాగార్జున, ఈ సమస్యలపై మాట్లడాలేకపోవడం హాస్యాస్పదం. ‘ఇంకెప్పుడూ కింగ్ నాగార్జున అని చెప్పుకోవద్దు..’ అంటూ నాగార్జున మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

రాజకీయం

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

Janasena: ‘జనసేన’కు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు కీలక తీర్పు

Janasena: జనసేన (Janasena ) కు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టులో భారీ ఊరట లభించింది. జనసేనకు గాజు గ్లాసు గుర్తు రద్దు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

నిజమా.? నాటకమా.? వైఎస్ జగన్ ‘గులక రాయి’పై జనసేనాని సెటైర్.!

అరరె.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగిందే.! వైసీపీ ఇలా ఎంత గింజుకున్నా, ప్రజల్లో సింపతీ అనేది మచ్చుకి కూడా కనిపించలేదు. విజయవాడ నగరం నడిబొడ్డున, కట్టు దిట్టమైన భద్రతా...

ఎక్కువ చదివినవి

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

పవన్ కళ్యాణ్ వెళితేగానీ, తిరుపతి సెట్టవలేదా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్ళారు, పార్టీ శ్రేణుల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి విషయమై నెలకొన్న గందరగోళాన్ని సరి చేశారు.! జనసేన నేత, టిక్కెట్ ఆశించి భంగపడ్డ కిరణ్ రాయల్, పవన్...