Switch to English

పవన్‌ కళ్యాణ్‌ ఒకే ఒక్కడు: ఈ ‘స్టార్లు’ అప్పుడేం చేశారు.?

‘ఎవరికి నొప్పి కలిగితే వాడే అరుస్తాడు..’ అన్నది నిజం. ‘పక్కోడు ఎలా పోయినా నాకేంటి సంబంధం’ అన్నదీ నిజం. తెలుగు సినీ పరిశ్రమకీ ఇది వర్తిస్తుంది. కానీ, పవన్‌ కళ్యాణ్‌ అందుకు భిన్నం. మహేష్‌బాబు సినిమా పైరసీ బారిన పడితే, పవన్‌ కళ్యాణ్‌ బాసటగా నిలిచాడు, మహేష్‌బాబుకి. కానీ, ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ బారిన పడితే, ఎవరు సినీ పరిశ్రమ తరఫున గట్టిగా మాట్లాడారు.?

దాదాపు పదేళ్ళ క్రితం మహేష్‌బాబు, ఓ ప్రముఖ వెబ్‌సైట్‌పై మండిపడ్డాడు. కొన్నేళ్ళ క్రితం యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గుస్సా అయ్యాడు. నేచురల్‌ స్టార్‌ నాని కూడా ఓ సమయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. దర్శక నిర్మాత సాయి రాజేష్‌ కూడా ఈ విషయమై గతంలో స్పందించాడు. కానీ, ఇంత గట్టిగా సినీ పరిశ్రమ అంతా ఒక్కటై స్పందించింది ఇప్పుడేనేమో.!

విజయ్‌ దేవరకొండతో మొదలైంది ఈ ప్రసహనం. మహేష్‌, రవితేజ వంటి హీరోలే కాదు, రాశి ఖన్నా, కాజల్‌ అగర్వాల్‌ లాంటి నటీమణులు కూడా రంగంలోకి దిగారు. అయితే, కొన్నేళ్ళ క్రితం సినీ పరిశ్రమపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి, పనిలో పనిగా పవన్‌ కళ్యాణ్‌పైనా.. ఆయన తల్లిపైనా అసభ్యకరమైన బూతులు తిట్టింది. అప్పుడూ సినీ పరిశ్రమ స్పందించాల్సిన రీతిలో స్పందించలేదు.

పవన్‌ కళ్యాణ్‌, ఆయా మీడియా సంస్థల పేర్లు ప్రస్తావిస్తూ, ఒంటరి పోరాటం చేశారు. దానికి రాజకీయ రంగు పులిమి, సినీ పరిశ్రమలోని కొందరు లైట్‌ తీసుకున్నారు. కానీ, ఇప్పుడేమయ్యింది.? అందరూ ముందుకొస్తున్నారు. ఇప్పటికైనా సినీ పరిశ్రమ ఒక్కతాటిపైకి వచ్చినందుకు సంతోషమే. కానీ, ఇది జస్ట్‌ పబ్లిసిటీ స్టంట్‌లా మిగిలిపోతుందా.? లేదంటే, పనిగట్టుకుని దుష్ప్రచారానికి దిగేవారిపై చర్యలకు సినీ పరిశ్రమ ముందడుగు వేస్తుందా.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సినీ పరిశ్రమ అన్నాక గాసిప్స్‌ మామూలే. సినిమా సమీక్ష అనేది వేరే అంశం. కానీ, గాసిప్స్‌ పేరుతో, వ్యక్తిగత జీవితాల్ని బజార్న పడేయడం, పనిగట్టుకుని కొందరిపై దుష్ప్రచారం చేయడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. సినీ పరిశ్రమ ఈ విషయంలో కాస్త లోతుగానే ‘వాత’ పెట్టాల్సి వుంది. అదే సమయంలో, సినీ పరిశ్రమ ‘ఐక్యత’పై సినీ ప్రముఖులు ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే.. అది పరిశ్రమకీ మంచిది.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: దున్నపోతును హింసించారు.. ఎలా పగ తీర్చుకుందో తెలుసా..

కర్మ సిద్ధాంతం ప్రకారం.. మనం చేసిన పనులే మనల్ని వెంటాడుతూ మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. కొంతమంది ఆకతాయిలు చేసిన ఆ తుంటరి పనే వారికి కర్మ రూపంలో జరిగింది. తనను...

ఫ్లాష్ న్యూస్: ఆఫ్రికా నుండి ఇండియాకు చేరిన మిడుతల దండు

మొన్నటి వరకు ఆఫ్రికా దేశాలను అల్లాడించి అతలాకుతలం చేసిన మిడతల దండు పాకిస్తాన్ మీదుగా ఇండియా చేరింది. ప్రస్తుతం ఉత్తర భారతంలో ఈ మిడతల దండు రైతుల పాలిట రాక్షసులుగా మారాయి. పంట...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

బీహార్ బాలిక సాహసానికి ఇవాంకా ఫిదా.!

ప్రమాదానికి గురై నడవలేని స్థితిలో ఉన్న తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఏకంగా 1200 కిలోమీటర్లు ప్రయాణించిన 15 ఏళ్ల బీహార్ బాలికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్...

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...