“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు.
కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు.
అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం.
కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు.
భారీ ప్రమోషన్స్ చేసి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.
చివరికి మాట్లాడేది కంటెంట్ మాత్రమే.
ప్రస్తుతం “పెద్ది”కి గ్రౌండ్ లెవెల్‌లో మంచి బజ్ ఉంది.
బాక్సాఫీస్‌కు కావాల్సిన మొమెంటమ్ తీసుకురావడానికి అది చాలు. మిగతా పని సినిమా కంటెంట్ చూసుకుంటుంది.
ఈ 18న ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
అది వచ్చిన తర్వాత సినిమాపై హైప్ మరింత
పెరగడం ఖాయం.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే…
ఆ మధ్య రిలీజ్ అయిన ఒక “సక్సెస్‌ఫుల్” సినిమాకి చేసిన ప్రమోషన్స్‌తో ఇప్పుడు “పెద్ది”ని పోల్చడం.
అంటే… ఆ “సక్సెస్‌ఫుల్” సినిమాకి ఇంకా సీక్వెల్ కూడా అనౌన్స్ చేయలేదన్నది వేరే విషయం.
ఫ్యాన్స్‌కి ఒక్క మాట —
ప్రమోషన్స్ గురించి టెన్షన్ పడకండి.
ప్రశాంతంగా ఉండండి.
“ఆ “సక్సెస్‌ఫుల్” సినిమా లాగా డే-1 రికార్డులతో సరిపెట్టే సినిమా కాదు “పెద్ది”…
ఎక్కువ రోజులు బాక్సాఫీస్ దగ్గర గట్టిగా నిలబడే సినిమా”.. అని టీం ఇప్పటికే అనేక సంకేతాలు ఇచ్చింది.
“నో డౌట్ ..ఈ సారి రామ్ చరణ్ గట్టిగా కొట్టబోతున్నాడు.. ఈ పోస్టర్ లో లా ” అన్నది ఇండస్ట్రి టాక్.
