కంప్యూటర్ యుగంలో కూడా అమ్మాయిలు.. అబ్బాయిల డ్రస్ ల గురించి మాట్లాడుకోవడం విచారకరం. అస్సాంలో దారుణ సంఘటన జరిగింది. ఒక అమ్మాయి షార్ట్ నెక్కర్ ను వేసుకుని పరీక్షకు హాజరు అయితే ఆమెను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. సాదారణంగా అయితే పరీక్షకు లేటు వస్తే లేదా హాల్ టికెట్ లేకుంటే పరీక్షకు అనుమతించరు. కాని ఈ అమ్మాయిని మాత్రం షార్ట్ వేసుకు వెళ్లిన కారణంగా పరీక్ష రాయనివ్వలేదు.
ఆమె చాలా బాధపడి కన్నీరు పెట్టుకుంది.. ఆ అమ్మాయి తండ్రి కూడా పరీక్ష నిర్వాహకులకు విజ్ఞప్తి చేశాడు. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. చివరకు షాప్ కు వెళ్లి అమ్మాయి తండ్రి పాయింట్ తీసుకు వచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమెకు ఒక డోర్ కర్టన్ ను ఇచ్చి కాళ్లకు కప్పుకోమని చెప్పి పరీక్ష రాయించేందుకు ఓకే చెప్పారు. ఈ సంఘటనపై ప్రజా సంఘాలు మహిళ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అస్సాంలో అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష సందర్బంగా ఈ సంఘటన జరిగింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు ఇలాగే వెళ్తే అక్కడ ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది.