యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్ట్ చేయనున్నాడు. అలాగే ఎన్టీఆర్ 31వ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ హ్యాండిల్ చేయబోతున్నాడు.
ఎన్టీఆర్ – కొరటాల శివ ప్రాజెక్ట్ విషయానికొస్తే జులై నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది. ముందుగా హీరోయిన్ గా అలియా భట్ ను అనుకున్నారు. ఆమె కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. అయితే ఎందుకనో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
ఈ ప్యాన్ ఇండియా సినిమాకు దీపికా పదుకోన్ హీరోయిన్ గా ఉండాలని భావించారు కానీ ఆమె కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు. మరి ఏ భామ ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగమవుతుందో చూడాలి. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.