Switch to English

దాస్ కా ధమ్కీ’ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది: నివేదా పేతురాజ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,187FansLike
57,764FollowersFollow

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ విలేఖరుల సమావేశంలో దాస్ కా ధమ్కీ’ విశేషాలని పంచుకున్నారు.

పాగల్ తర్వాత మళ్ళీ విశ్వక్ సేన్ తో పని చేయడం ఎలా అనిపిస్తోంది ?

‘పాగల్’ చేస్తున్నప్పుడే ‘ఓరి దేవుడా’ కి కాల్ వచ్చింది. కానీ ఆ పాత్ర నాకు సరిపోదని భావించాను. తర్వాత ధమ్కీ స్క్రిప్ట్ విన్నాను. చాలా నచ్చింది. చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది.

ఇలాంటి పాత్రలో గతంలో కనిపించలేదు కదా ?

అవును. కెరీర్ మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా గ్లామరస్ రోల్. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి.

పాగల్ విశ్వక్ హీరోగా చేశారు. కానీ ఇందులో హీరోతో పాటు దర్శకుడు నిర్మాతగా కూడా చేశారు కదా .. ఎలా అనిపించింది ?

హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశారు. ఎప్పుడు ఏం కావాలన్నా సమకూర్చారు. ఇక దర్శకుడిగా అయితే విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి తర్వాత అంత ఎనర్జీ వున్న దర్శకుడిని విశ్వక్ సేన్ లో చూశాను.

ఎన్టీఆర్ గారు విశ్వక్ ని దర్శకత్వం ఆపేయాయాలని అన్నారు కదా ?

విశ్వక్ గొప్ప ఎనర్జీ వున్న దర్శకుడు. తన దగ్గర చాలా అద్భుతమైన పాయింట్స్ వున్నాయి. అయితే తానే నటుడిగా కాకుండా వేరే హీరోలని డైరెక్ట్ చేయాలని నా అభిప్రాయం. విశ్వక్ లో చాలా మాస్ వుంది. లోకేష్ కనకరాజ్ లాంటి టచ్ వుంది. బాలకృష్ణ గారు లాంటి పెద్ద మాస్ హీరోలని డైరెక్ట్ చేసే సత్తా విశ్వక్ లో వుంది. తనకి గ్యాంగ్ స్టార్ సినిమాలంటే పిచ్చి. తను చాలా మంచి గ్యాంగ్ స్టార్ డైరెక్టర్ అవుతారు. తన దగ్గర చాలా మంచి కథలు వున్నాయి.

రావు రమేష్, రోహిణి గారితో పనిచేయడం ఎలా అనిపించింది

రావు రమేష్ గారు, రోహిణి గారు.. ఇందులో వున్నా అందరితో నాకు సీన్స్ వున్నాయి. అందరూ అద్భుతంగా చేశారు. రోహిణీ గారు అద్భుతమమైన నటి. కేవలం కళ్ళతోనే నటించగలదు. ఇందులో ఒక ఒక సీన్ వుంది. కేవలం వీల్ చైర్ లో కూర్చుని డైలాగ్ లేకుండా కూడా కన్నీళ్లు తెప్పించే సీన్ అది.

‘దాస్ కా ధమ్కీ’పై మీ అంచనాలు ఏమిటి ?

దాస్ కా ధమ్కీ’ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. విశ్వక్ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. అలాగే దాస్ కా ధమ్కీ’ విశ్వక్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ గా నిలుస్తుంది.

‘దాస్ కా ధమ్కీ’ బలాలు ఏమిటి ?

‘దాస్ కా ధమ్కీ’కి ప్రధాన బలం కథ. తర్వాత నటీనటులు. రావు రమేష్ గారు చాలా అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ కూడా ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

దర్శకత్వం చేయాలనే ఆలోచన ఉందా ?

వుంది కానీ ఇప్పుడే కాదు. నిర్మాణం మాత్రం చేసే ఆలోచన లేదు. (నవ్వుతూ) నటనతో పాటు బిజినెస్ పై కూడా ద్రుష్టి పెడుతున్నా. చెన్నయ్ లో రెస్టారెంట్ ఒకటి ప్రారంభించా.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ?

సుస్మిత గారి నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నా. హిందీ టీ సిరిస్ లో ఒక సినిమా చేస్తున్నా.

5 COMMENTS

  1. Club ACE, Club King, Club Queen, Club Jack, Club Ten và Club Nime có tất cả những game đánh bài được yêu thích nhất,
    hay nhất để việc bỏ tiền của bạn là
    hoàn toàn xứng đáng, có thể đem tới những giây phút giải trí thú vị cho
    bạn, cũng không quên kiếm thêm thu nhập lúc rảnh rỗi.
    Cụ thể như sau:- Tên đăng nhập,
    các bạn phải nhập ít nhất là 6 ký tự.
    Đáng chú ý hơn cả là người chơi có thể tải ứng dụng Fb88 về
    điện thoại của mình. Tương tự như trên, bạn có thể nạp tiền vào tài khoản VN88 bằng thẻ cào điện thoại.
    Hiện nay, nhà cái uy tín FB88 đã có mặt trên cả hệ
    thống website dành cho máy tính, điện thoại trên các trình duyệt khác nhau như Chrome,
    FireFox, Safari… Nhà cái nào được Nhacaiso1 revview thì
    những nhà cái đều an toàn và uy tín hết nên các bạn khỏi lo nhé.

  2. Từ người chơi lâu năm được tri ân đến người chơi mới với nhiều phần thưởng phong phú.

    Nhận 38% Thưởng Chào Mừng, lên đến Một Triệu 500 Trăm
    Đồng! Nhận 100% Thưởng Chào Mừng, lên đến Hai Triệu Đồng!
    Tham gia quay hũ để nhận thưởng lên tới 150% giá trị.
    Tham gia xổ số, quay hũ với giá trị tiền thưởng hàng tỷ đồng.
    Số tiền thưởng ít nhiều sẽ phụ thuộc vào cấp
    độ thành viên. Nhân viên fb88 sẽ phản hồi email của bạn trong thời
    gian sớm nhất. Các đường link truy cập Fb88
    thường bị chặn? Bạn hoàn toàn có
    thể trải nghiệm mọi tính năng và đa dạng các sản phẩm cá cược từ slots game, live casino, cá độ bóng đá… Với những ưu điểm hấp dẫn của mình FB88 luôn được người chơi ưa thích khi trải nghiệm.
    Khách hàng nạp tiền trong ngày mức 10 triệu tặng 300 điểm vào tài khoản. Và
    về chuyện mật khẩu để đăng nhập khách hàng nên chọn một dãy số
    kèm thêm chữ sao cho gần gũi và dễ nhớ với mình để khi đăng nhập được dễ dàng,
    và củng là để tránh sự cố như tài khoản của mọi người lỡ bị lấy cắp
    và sao lưu lại mật khẩu cho các lần đăng nhập tiếp theo ở thiết bị truy cập của mọi
    người.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వీరిద్దరూ ఇప్పుడు తాజాగా పెళ్లి...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 17 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 17- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు. తిథి: శుక్ల చతుర్దశి...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు తెలుసా?

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి మూడో...