Switch to English

నిత్యా మేనన్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

నిత్యా మేనన్ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్. అందులో నో డౌట్. ఆమెను హీరోయిన్‌గా కంటే ఆర్టిస్ట్‌గా అభిమానించే ఆడియన్స్ ఎక్కువమంది ఉన్నారు. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కంటే సంథింగ్ స్పెషల్‌గా ఉండే క్యారెక్టర్స్ నిత్య చేస్తుంటుంది. యాక్టర్‌గా ప్రూవ్ చేసుకుంది.

ఎంతపెద్ద యాక్టర్ అయినాసరే కొన్ని స్పెషల్ ఫిలిమ్స్, క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ప్రిపేర్ అవుతారు. ‘బాహుబలి’ కోసం ప్రభాస్, ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్, ‘దంగల్’ కోసం ఆమిర్ ఖాన్ ప్రిపేర్ అయ్యారు. కొంత ట్రైనింగ్ తీసుకున్నారు. స్పెషల్ ఫిలింకి నిత్యా మేనన్ మాత్రం తనకు ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదని చెబుతుంది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై మూడు నాలుగు బయోపిక్స్ అనౌన్స్ చేశారు. అందులో ప్రియదర్శిని దర్శకత్వంలో జయలలితగా నిత్యా మేనన్ యాక్ట్ చేయనున్న బయోపిక్ ‘అమ్మ’ ఒకటి. నెక్స్ట్ ఇయర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తాను స్పెషల్ గా ప్రిపేర్ కావాలసిన అవసరం లేదని నిత్యా మేనన్ చెబుతుంది. “నాకు తమిళం వచ్చు. భరతనాట్యం కూడా వచ్చు. ప్రిపరేషన్ ఎందుకు?” అని ఎదురు ప్రశ్నిస్తుంది. నిత్యా మేనన్‌ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా? అనేది తమిళులకు అర్థం కావడం లేదు.

ప్రజలు అందరికీ తెలిసిన విషయాలు మాత్రమే కాకుండా, జయలలిత వ్యక్తిగత విషయాలు చాలా ‘అమ్మ’లో ఉంటాయని నిత్యా మేనన్ చెప్పింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ వర్క్ కంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ అని, అందుకని సినిమా అనౌన్స్ చేసినా షూటింగ్ స్టార్ట్ చేయలేదని ఆమె తెలిపింది.

4 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎక్కువ చదివినవి

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ప్రభుత్వ స్థిరత్వమే పెట్టుబడులకు బలం: పూణేలో లోకేష్ స్పష్టం

పూణే: ప్రభుత్వాల కొనసాగింపే రాష్ట్రాభివృద్ధికి కీలకమని, పాలసీల్లో స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర పూణేలో గోఖలే ఇన్‌స్టిట్యూట్...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ జీవితంలోనూ తాను హీరోనేనని మరోసారి నిరూపించారు....

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...