యంగ్ హీరో నితిన్ తమ్ముడు మూవీతో గట్టి హిట్ కొట్టాలనే తాపత్రయంలో ఉన్నాడు. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు మూవీకి మంచి హైప్ ఉంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అలాగే రిలీజ్ డేట్ ను కూడా వెరైటీగా అనౌన్స్ చేశారు.
జులై 4న రిలీజ్ చేస్తామని ప్రకటించారు వేణు శ్రీరామ్ పుట్టినరోజు నాడు ప్రకటించారు. అన్నీ రెడీ చేసుకుంటున్న టైమ్ లో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ మే 30 నుంచి జులై 4కు వాయిదా పడింది. దీంతో నితిన్ తమ్ముడు సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎందుకంటే సోలోగా వస్తేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో జులై 24న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కింగ్ డమ్ మూవీ టీమ్ రిక్వెస్ట్ తో తమ్ముడు సినిమాను వాయిదా వేసుకన్నట్టు సమాచారం వస్తోంది.
జులై సినిమాలో పెద్ద సినిమాలు ఏవీ లేవు .ఆగస్టు 14న వార్-2 ఉంది. కాబట్టి ఆ లోపు తమ్ముడు సినిమాకు రెవెన్యూ పరంగా కలిసొచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఎలాగూ హైప్ ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ గా వాడుకుంటే బెటర్ అన్నది తమ్ముడు మూవీ యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.
