లవర్ బోయ్ నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా కెతిక శర్మ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
రాబిన్ హుడ్ సినిమాకు హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల మంచి ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో ఒక బజ్ ఏర్పడింది. ఇక ఈ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో నితిన్ రాబిన్ హుడ్ స్ట్రెంత్ గురించి చెప్పుకొచ్చారు. ఇతరులను ఏమార్చే పాత్రలో హీరో క్యారెక్టరైజేషన్ ఉంటుందని దాంతో పాటు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్, శ్రీలీల ఇలా ప్రతి పాత్ర చాలా బలంగా ఉంటాయని అన్నారు.
వెంకీ కుడుముల మార్క్ హ్యూమర్ ఈ సినిమాలో కూడా ఉంటుందని. అంతేకాకుండా కమర్షియల్ యాంగిల్ కూడా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు నితిన్. సినిమాను ఆల్రెడీ చూశాం కాబట్టే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్పారు నితిన్.
వెంకీ కుడుములతో నితిన్ ఆల్రెడీ భీష్మ సినిమా తీసి సక్సెస్ అందుకున్నారు. మళ్లీ ఆఫ్టర్ 5 ఇయర్స్ కి రాబిన్ హుడ్ తో రాబోతున్నారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అంచనాలను ఏర్పరచుకుంది. మరి సినిమా రిజల్ట్ ఏంటన్నది చూడాలి.