Robinhood: నితిన్-శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్‌హుడ్’. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదలవుతోందీ సినిమా. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈక్రమంలో సినిమా నుంచి పాప్ క్వీన్ విద్యా వోక్స్ పాడిన వన్ మోర్ టైమ్ పాట రిలీజ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్.
లవ్ ఫ్యూజన్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ నితిన్, శ్రీలీల మధ్య కెమెస్ట్రీని తెలియజేస్తూ పాట విడుదల చేశారు. ప్రేయసి ప్రేమ కోసం తపించే ప్రేమికుడి పాట ఇది. యూత్ ని అట్రాక్ట్ చేసేలా పాటను కంపోజ్ చేశారు జీవీ ప్రకాశ్ కుమార్. హుషారైన సంగీతానికి తగ్గట్టు నితిన్-శ్రీలీల స్టెప్పులతో పాటలో అలరించినట్టుందని చెప్పాలి.
ఎలక్ట్రోపాప్ జానర్‌లో హస్కీ ఇంగ్లీష్ కోరస్‌తో పాట ప్రారంభమవుతోంది. జి.వి.ప్రకాష్ కుమార్, పాప్ క్వీన్ విద్యా వోక్స్ డిఫరెంట్ వోకల్స్ తో అలరించారని చెప్పాలి. అద్భుతమైన లొకేషన్లలో పాటను తెరకెక్కించారు. దీంతో సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది టీమ్.