Nithin: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానిగా తన వైఖరి ఎప్పుడూ మారదని హీరో నితిన్ (Nithin) అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ (Extraordinary Man) సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వైఖరిని స్పష్టం చేశారు. ‘ఇండస్ట్రీకి ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చాను. మొదటి నుంచీ పవన్ అభిమానిగానే చెప్పుకున్నాను. ఆయనకు కోట్లలో అభిమానులు ఉన్నారు. హీరోలకే ఆయనంటే ఇష్టం. నాకంటే ఎక్కువమంది హీరోలే పవన్ ఇమేజ్ ను చూపించారు’.
‘నేను అప్పుడూ.. ఇప్పుడూ పవన్ అభిమాననినే చెప్తాను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వారి ఇమేజ్ ఉపయోగించుకుని హీరోగా నిలబడ్డాక అంతా నేనే అని చెప్పుకోను. ప్రతి సినిమాలో ఆయన ఇమిటేషన్ ఉండేలా చూస్తాను. ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ లో కూడా ఓ సీన్ సందర్భంగా ఆయనలా డ్రెస్ వేసుకున్నాను. అదేదో ప్రమోషన్ లేదా ఫొటోషూట్ కోసం కాద’ని అన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరెకెక్కిందీ సినిమా. శ్రీలీల హీరోయిన్. డిసెంబర్ 8న విడుదల కానుంది.