Switch to English

నితిన్‌ ఆ సినిమా వదిలేయలేదట

నితిన్‌ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో గతంలో ‘చల్‌ మోహన్‌ రంగ’ చిత్రం వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నిరాశ పర్చింది. నిర్మాతలతో పాటు నితిన్‌కు కూడా తీవ్రంగా నిరాశనే కలిగించింది. ఆ సినిమా నిరాశ పర్చినా కూడా కృష్ణచైతన్య దర్శకత్వంలో నితిన్‌ మరో సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడంటూ గత ఏడాది వార్తలు వచ్చాయి. పవర్‌ పేట అనే టైటిల్‌తో వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుందని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత పవర్‌ పేట రెండు మూడు పార్ట్‌లుగా రానుందన్నారు.

ఆ వార్తలు వచ్చి ఏడాది కాబోతుంది. కాని ఇప్పటి వరకు ఆ ఊసే లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ వర్కౌట్‌ అవ్వదనే ఉద్దేశ్యంతో పక్కకు పెట్టేశారని అంతా అనుకున్నారు. కాని నితిన్‌ తాజాగా భీష్మ ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ సినిమాను వదిలేసినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నాడు. ప్రస్తుతానికి ఆ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయని.. కథ చాలా బాగుండటం వల్ల నేను దాన్ని ఎలాగైనా చేయాలనుకున్నాను అన్నాడు.

ఇంకా పవర్‌ పేట సినిమా గురించి నితిన్‌ మాట్లాడుతూ కథ చాలా పెద్దగా ఉంటుంది కనుక మూడు పార్ట్‌లు చేయాలనుకుంటున్నాం. మూడు పార్ట్‌ల్లో నేను 18 ఏళ్లు, 30 ఏళ్లు, 60 ఏళ్ల వయసు వ్యక్తిగా కనిపిస్తాను అన్నాడు. ఈ మూడు షేడ్స్‌ కోసం కాస్త రిస్క్‌ తీసుకోవాల్సి ఉందని అందుకే టైం తీసుకుంటున్నట్లుగా చెప్పాడు. ఇక సినిమా 1960 నుండి మొదలుకుని మూడవ పార్ట్‌లో 2020లో ముగుస్తుందని, కథ అలా 60 ఏళ్లు కొనసాగుతుందని నితిన్‌ చెబుతున్నాడు. ఇలాంటి కాన్సెప్ట్‌లు తెలుగులో రాలేదు. కనుక కాస్త బాగున్నా కూడా ఆధరణ పొందే అవకాశం ఉందని అంటున్నారు.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

ప్రత్యేక హోదాపై వైఎస్‌ జగన్‌ ఆశాభావం.. ఇదేం రాజకీయం.?

ప్రత్యేక హోదా విషయమై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రత్యేక హోదాపై వైఎస్సార్సీపీ ‘చేతులెత్తేసిన వైనాన్ని’ స్పష్టం చేస్తున్నాయి....

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

ఓటీటీ రిలీజ్ : నవదీప్ ‘రన్’ మూవీ రివ్యూ

నటీనటులు: నవదీప్, పూజిత పొన్నాడ, వెంకట్, అమిత్, షఫీ, మధు నందన్, భానుశ్రీ, కిరీటి తదితరులు. నిర్మాతలు: రాజీవ్ రెడ్డి, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా రన్ టైం: 86 నిముషాలు విడుదల తేదీ: మే 29,...

బర్త్‌డే స్పెషల్‌ : తెలుగు సినిమాకు సరికొత్త హంగులు అద్దిన సినీ శాస్త్రవేత్త

తెలుగు సినిమా గురించి మాట్లాడాలంటే, తెలుగు సినిమా చరిత్ర గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ పేరు ఎత్తకుండా మాట్లాడటం అసాధ్యం. తెలుగు సినిమా అనే ప్రయోగశాలలో కృష్ణ ఎన్నో ప్రయోగాలు...

మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.!

నేటి తరంలో వినోదం అనేది ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పటికీ, సినిమా టికెట్ల ధరలు మన అవసరాల కంటే ఎక్కువ అయినప్పటికీ సిసలైన వినోదం కోసం థియేటర్లకు వెళ్ళి మరీ సినిమాలు చూస్తాం. అసలు...