ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల్ని ఒకేసారి ఖరారు చేసేశాడు యంగ్ హీరో నితిన్. ‘భీష్మ’ సినిమా నిజానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి వుంది. అనివార్య కారణాలతో అటకెక్కిపోయిందనుకున్న ఆ సినిమా ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమయ్యింది. ‘భీష్మ’ అలా ప్రారంభమయ్యిందో లేదో.. ఆ వెంటనే నితిన్ నుంచి ఇంకో సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అదే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ చేయబోయే సినిమా గురించిన అనౌన్స్‌మెంట్. కేవలం అనౌన్స్‌మెంట్ మాత్రమే కాదు, సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయింది.
ఇంతలోనే ఇంకో షాక్ ఇచ్చాడు నితిన్. ఇది తన మరో కొత్త సినిమా గురించిన న్యూస్‌తో ఇచ్చిన షాక్. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా ఖరారయ్యింది. ఆ సినిమా టైటిల్‌ని కూడా అనౌన్స్ చేసేశారు. ‘రంగ్‌దే’ టైటిల్‌తోపాటుగా ఈ సినిమా సమ్మర్‌లో విడుదలవుతుందనీ టైటిల్ లుక్‌లోనే క్లారిటీ ఇచ్చేశారు. ఒక్క నెలలో మూడు సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అనౌన్స్‌మెంట్స్ జరిగిపోయాయి నితిన్ విషయంలో.
‘భీష్మ’ ఎప్పటినుంచో అనుకుంటుటున్నదే అయినా, ఇటీవలే పట్టాలెక్కింది. సినిమానే అటకెక్కిపోయిందని అంతా అనుకున్నారు. హీరోయిన్ రష్మిక కూడా అంత ఇంట్రెస్ట్‌తో లేదనే ప్రచారం జరిగింది. ఎలాగైతేనేం, ఆ గాసిప్స్ అన్నీ ఇప్పుడు పటాపంచలైపోయాయ్. అయితే, ‘భీష్మ’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుంది.? చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా మాటేమిటి.? సమ్మర్‌లో నితిన్ ‘రంగ్‌దే’ రావడం ఖాయమేనా.? ఇలా కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సినిమాలు ప్రకటించినంత స్పీడ్, ఆ సినిమాల నిర్మాణంలో వుండడం కష్టమే. అందునా అక్కడున్నది నితిన్. ‘భీష్మ’ విషయంలో ఏం జరిగిందో చూశాం. అయితే, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, చాలా వేగంగా సినిమాలు చేయాలన్న ఆలోచనతో నితిన్ వున్నాడని తెలుస్తోంది. ఇప్పటికి అనౌన్స్ అయిన మూడు మాత్రమే కాదు, మరో రెండు ప్రాజెక్టులు కూడా అతి త్వరలోనే ఫైనల్ చేయబోతున్నాడట నితిన్.
ప్లానింగ్‌కి టైమ్ తీసుకున్నాడు తప్ప, ఎగ్జిక్యూషన్ విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడని నితిన్ సన్నిహితులు అంటున్నారు. చంద్రశేఖర్ ఏలేటి సినిమా కోసం రకుల్ ప్రీత్ సింగ్, వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్‌ని తీసుకున్న నితిన్, ‘రంగ్‌దే’ సినిమా కోసం కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు. హీరోయిన్ల పరంగా చూసుకుంటే, నితిన్‌ది బెస్ట్ సెలక్షన్ అనే చెప్పాలేమో.