Switch to English

ఇంటర్వ్యూ: నితిన్, పీసీ శ్రీరామ్ లు అలా చేయడం నాకు బిగ్గెస్ట్ షాక్ – డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

‘తొలిప్రేమ’‌, ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ చిత్రాల త‌ర్వాత వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూడో చిత్రం ‘రంగ్ దే’. నితిన్‌, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించారు. మార్చి 26న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా ‘రంగ్ దే’ సినిమా గురించి డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పిన ఇంటర్వ్యూ విశేషాలు..

‘రంగ్ దే’ ఆలోచన ఎలా పుట్టింది మరియు కథ ఏంటి?

‘మిస్ట‌ర్ మ‌జ్ను’ త‌ర్వాత ప‌క్కింటి అబ్బాయి, ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్ర‌ల‌తో ఒక క్యూట్ ఫ్యామిలీ మూవీ చెయ్యాల‌నే ఆలోచ‌న వచ్చింది. అలా అనుకున్నప్పుడు అర్జున్‌, అను పాత్ర‌లు నా మ‌న‌సులో పుట్టాయి. ఇక కథ అంటే ప‌క్క ప‌క్క‌నే ఉండే రెండు కుటుంబాల క‌థ ఇది. స‌హ‌జంగానే మ‌నం మ‌న ఇంట్లోవాళ్ల‌ను ప‌క్కింటివాళ్ల‌తో పోలుస్తుంటాం. దానివల్ల వాళ్ల మ‌ధ్య ప్రేమ‌, ద్వేషం లాంటి ఎమోష‌న్స్ ఏర్ప‌డుతుంటాయి. అలా పొరుగిళ్ల‌లోని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మ‌ధ్య వ్య‌వ‌హారం పెళ్లిదాకా వ‌స్తే ఎలాంటి ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయ‌నేది ఆస‌క్తిక‌రంగా చిత్రీక‌రించాం. ఈ మూవీలో ఇటు క‌డుపుబ్బ న‌వ్వించే హాస్య స‌న్నివేశాల‌తో పాటు, మ‌న‌సుని త‌ట్టే భావోద్వేగ స‌న్నివేశాలూ ఉంటాయి.

‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్ట‌డం వెనుక ఏదైనా ప్రత్యేక కార‌ణం ఉందా?‌

ఇంద్ర‌ధ‌న‌స్సులోని ఏడు రంగుల్లో ఒక్కొక్క‌టి ఒక్కో ఎమోష‌న్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని చెబుతుంటారు. అలాగే ఈ సినిమా క‌థ‌లో ర‌క‌ర‌కాల భావోద్వేగాలు ఉంటాయి. అందుకే ‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్టాం. చివ‌రి 35 నుంచి 40 నిమిషాల సినిమా నిజంగా ఎమోష‌న‌ల్‌గా న‌డుస్తుంది.

హీరోగా మీ మొద‌టి ఛాయిస్ నితిన్ యేనా?

నిజానికి నేను ఈ క‌థ రాసుకున్న త‌ర్వాత మొద‌ట నితిన్‌ను కాకుండా వేరే హీరోల‌ను అనుకున్నాను. ఈ సినిమా చేయ‌డానికి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ముందుకు వ‌చ్చాక‌, నితిన్ పేరును నిర్మాత నాగ‌వంశీ సూచించారు. నితిన్ ఒప్పుకుంటాడో, లేదోన‌నే సందేహంతోనే నేను క‌థ చెప్పాను. త‌ను సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేయ‌డంతో న‌మ్మ‌లేక‌పోయాను. క‌థ‌ను ఆయ‌న అంత‌గా న‌మ్మాడు.

‘మ‌హాన‌టి’ త‌ర్వాత కీర్తి వ‌రుస‌గా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేశారు. ఈ రోల్‌తో ఆమెకు ఎలాంటి పేరు వ‌స్తుంద‌నుకుంటున్నారు?

‘మ‌హాన‌టి’ ఒక లెజండ‌రీ ఫిల్మ్‌. నేను ఈ సినిమా కోసం సంప్ర‌దించిన‌ప్పటికి కీర్తి, మిస్ ఇండియా, పెంగ్విన్‌, గుడ్‌ల‌క్ స‌ఖి సినిమాలు రాలేదు. మ‌హాన‌టి వ‌చ్చాక కీర్తిని ఆ సినిమా ఫేమ్‌ గానే చెప్తున్నారు కానీ, దానికంటే ముందు ఆమె మంచి మంచి రోల్స్ చాలా బాగా చేసింది. ఈ సినిమాలో అను పాత్ర ఆమెకు మంచి పేరు తెస్తుంద‌ని న‌మ్ముతున్నాను.

నితిన్‌, కీర్తి సురేష్‌ల‌తో సెట్స్ మీద ప‌నిచేసిన అనుభ‌వం ఎలాంటిది?

నితిన్ నాకు ప‌దిహేనేళ్లుగా ప‌రిచ‌యం. అందువ‌ల్ల నాకు త‌న‌తో సెట్స్ మీద చాలా సౌక‌ర్యంగా అనిపించింది. కీర్తి విష‌యానికి వ‌స్తే, ఆమె వెనుక ‘మ‌హాన‌టి’ తో వ‌చ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ రెండో రోజు నుంచే చాలా కంఫ‌ర్ట్ అట్మాస్పియ‌ర్‌ను క్రియేట్ చేసింది. అలా ఆ ఇద్ద‌రితో చాలా సౌక‌ర్యంగా ఈ సినిమా చేశాను. చెప్పాలంటే నా కంటే నితిన్‌, కీర్తిలు ఎక్కువగా ఈ క‌థ‌ను న‌మ్మ‌డంతో వాళ్ల పాత్ర‌ల‌తో మ‌రింత బాగా ప్ర‌యోగాలు చేయ‌వ‌చ్చనిపించింది. ట్రైల‌ర్ రిలీజ్ చేశాక నా సినిమాల‌కు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

పీసీ శ్రీ‌రామ్ లాంటి ప్ర‌ఖ్యాత సినిమాటోగ్రాఫ‌ర్‌తో ప‌నిచేశారు క‌దా.. ఎలా అనిపించింది?

పీసీ శ్రీ‌రామ్ గారితో అయితే క‌లిసి ప‌నిచేస్తాన‌ని నేను క‌ల‌లో కూడా ఊహించ‌లేదు. ఇండియాలోని టాప్ సినిమాటోగ్రాఫ‌ర్ ఆయ‌న. క‌థ చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది. అదొక షాక్ నాకు. ఆయ‌న‌కు ముందుగానే బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేయాలి, అదీ ఇంగ్లిష్‌లో. అది ఇచ్చాక ఆయ‌న త‌న అసిస్టెంట్లు ఆరేడుగురికి ఇచ్చి, చ‌ద‌వ‌మ‌ని చెప్పారు. అలా అంద‌రికీ ఆ స్క్రిప్ట్‌లో ఎప్పుడు ఏ సీన్‌, ఏ షాట్ వ‌స్తుందో తెలుసు. ఆయ‌న సెట్స్ మీదుంటే ఎవ‌రూ రిలాక్స్ అవ‌డానికి ఛాన్సే ఉండ‌దు, నాతో స‌హా. ఆయ‌న వ‌ల్లే 64 రోజుల్లో సినిమాని పూర్తి చేశాం. ఒక ద‌ర్శ‌కుడ్ని అయివుండి కూడా ఆయ‌న ద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నా.

దేవి శ్రీ‌ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌ణితో ప‌నిచేసిన అనుభ‌వం ఎలా ఉంది?

దేవి శ్రీ‌ప్ర‌సాద్ ఈ సినిమాకు ఏం కావాలో అది ఇచ్చారు. ఆయ‌నిచ్చిన సాంగ్స్ ఒకెత్తు అయితే, రీరికార్డింగ్ ఇంకో ఎత్తు. ఈ సినిమాకు పాట‌లూ, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్ల‌స్ అవుతాయి. ఇక శ్రీ‌మ‌ణి అయితే ఈ సినిమాతో క‌లిపి నాకు 18 పాట‌లు రాసిచ్చాడు. వ‌దులుకోవాల‌న్నా మేం ఇద్ద‌రం ఒక‌ర్నొక‌రం వ‌దులుకోలేం. ‌‌

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ గురించి ఏం చెబుతారు?

నిర్మాణ విలువ‌ల విష‌యంలో సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్ ఏ రోజూ రాజీ ప‌డ‌లేదు. ఉదాహరణకి మేం ఇట‌లీలో షూటింగ్ ప్లాన్ చేసిన‌ప్పుడు అక్క‌డ లాక్‌డౌన్ అన్నారు. ఇక ఇండియాలోనే షూటింగ్ చేసేద్దామ‌నుకున్నా. కానీ నాగ‌వంశీ అలా కాద‌ని దుబాయ్‌లో ప్లాన్ చేయించారు. క‌థ‌లోనూ దానికి త‌గ్గ‌ట్లుగా బ్యాక్‌డ్రాప్ మార్చాం. ఈ సినిమా కోసం ఖ‌ర్చు పెట్టిన‌దంతా మీకు తెర‌మీద క‌నిపిస్తుంది.

మీ త‌ర్వాత సినిమా ఏంటి?

సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, దిల్ రాజు బ్యాన‌ర్ క‌లిసి నా త‌దుప‌రి చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. అది ల‌వ్ స్టోరీ కాదు. వేరే త‌ర‌హా సినిమా. ఇంత‌కంటే ఎక్కువ విష‌యాలు దాని గురించి చెప్ప‌లేను.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ గొడవలోకి హీరోయిన్ రీతూ వర్మ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...