Switch to English

నిర్భయ దోషులకి రేపే ఉరి.. పడుతుందా.? లేదా.?

ఇదిగో ఉరి.. అదిగో ఉరి.. అంటూ నిర్భయ దోషుల విషయమై గత కొద్ది కాలంగా నానా యాగీ జరుగుతోన్నమాట వాస్తవం. అత్యంత పాశవికంగా ‘నిర్భయ’పై దేశ రాజధాని ఢిల్లీలో హత్యాచారం చేశారు నిందితులు. ఈ కేసులో ఒకడు ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా, మరకొకడికి ‘జువైనెల్‌ యాక్ట్‌’ ప్రకారం విముక్తి లభించింది. ఇక, మిగిలిన నలుగురు దోషులుగా ఎప్పుడో తేలినా, ఇప్పటికీ శిక్ష పడలేదు. మరణ శిక్ష అమలు కావాల్సి వుండగా, పలు మార్లు అది వాయిదా పడుతూ వచ్చింది. ‘ఇంకెప్పుడు దొరుకుతుంది నా కుమార్తెకు న్యాయం..’ అంటూ నిర్భయ తల్లి న్యాయస్థానాల సాక్షిగా నెత్తీనోరూ బాదుకుంటున్నారు.

అయితే, తాజా డెత్‌ వారెంట్‌ ప్రకారం రేపే నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడాల్సి వుంది. చివరి నిమిషం వరకు దోషులు, శిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే వున్నారు. ఒకరి తర్వాత ఒకరు, అత్యంత నాటకీయ పరిణామాల మధ్య న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు బాధిత కుటుంబాన్ని ఇంకా ఇంకా బాధపెడుతూనే వున్నాయి.

తాజాగా, సుప్రీంకోర్టు నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్‌ గుప్తా వేసిన పిటిషన్‌ని కొట్టి పారేసింది. మరోపక్క, చివరి ప్రయత్నంగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాడు పవన్‌ గుప్తా. అయితే, రేపు ఉదయం తీహార్‌ జైల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాల్సి వున్న దరిమిలా, రాష్ట్రపతి నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.

మరోపక్క, క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో వున్నందున, డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్యర్థనని పాటియాలా హౌస్‌ కోర్టు తోసిపుచ్చింది. దాంతో, రేపు ఉదయాన్నే దోషులకు ఉరిశిక్ష పడే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. కానీ, నిర్భయ తల్లి మాత్రం.. ఈ వ్యవస్థపై తాను నమ్మకం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూనే వున్నారు. ఆమె ఇన్నేళ్ళుగా అనుభవిస్తోన్న మానసిక క్షోభ అలాంటిది మరి.

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

14 వేల సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన తారలు

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్...

కరోనాను గెలిచిన 103ఏళ్ల బామ్మ.. ఆనందంలో ఏం చేసిందంటే..

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ప్రభావానికి వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మరణాల్లో వృద్ధుల శాతమే ఎక్కువ. అయితే.. ఇందుకు వ్యతిరేకం గా 103ఏళ్ల బామ్మ కరోనాను జయించడం ప్రస్తుతం హాట్...

కరోనాతో కాదు.. కొత్త సమస్యతో అట్టుడికిపోతున్న అమెరికా!!

అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ తో ఊపిరాడని అమెరికాను ఐదు రోజులుగా ఓ సమస్య అట్టడుకించేస్తోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి...

మనం ‘సినిమాలు’ ఎందుకు చూస్తాం.!

నేటి తరంలో వినోదం అనేది ఒక్క క్లిక్ దూరంలో ఉన్నప్పటికీ, సినిమా టికెట్ల ధరలు మన అవసరాల కంటే ఎక్కువ అయినప్పటికీ సిసలైన వినోదం కోసం థియేటర్లకు వెళ్ళి మరీ సినిమాలు చూస్తాం. అసలు...