“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,480FansLike
57,764FollowersFollow

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు.

ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ నిమ్మల, “ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో జగన్ వ్యవహరిస్తున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంపేస్తాం, నరుకుతాం, అంతం చేస్తాం అనే భయానక సిద్ధాంతంతో వైసీపీ రాజకీయాలు చేస్తున్నదని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వస్తే పనులు నిలిపివేయడం, నిర్మాణాలను పడగొట్టడం, యువతను చెడగొట్టడం, డ్రగ్స్ ప్రోత్సహించడం, మహిళలను గెంటేయడం వంటి విధానాలతో ముందుకు వెళ్తుందని నిమ్మల ఆరోపించారు. మహిళలు, యువత కోసం ప్రకటిస్తున్న పాలసీలు విధ్వంసకరంగా ఉన్నాయని విమర్శించారు.

రాజకీయాలకు అడ్డొస్తే బంధుత్వం కూడా చూడకుండా వ్యవహరించే పార్టీ వైసీపీ అని, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించారు. గొడ్డలిపోటుతో జరిగిన మరణాన్ని గుండెపోటుగా ఎందుకు చెప్పారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పరిటాల రవి, వివేకా హత్య కేసులకు సంబంధించిన సాక్షులు, నిందితులు అనుమానాస్పదంగా మరణించడం వెనుక కారణాలు ఏమిటో వెల్లడించాలని కోరారు.

గుంటూరు ప్రాంతంలో ప్రజలను ఇళ్ల నుంచి లాగి బయటకు తీస్తామని, ఇళ్లలోకి వెళ్లి చంపుతామని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని నిమ్మల ఆరోపించారు. మీడియాపై కూడా ఒత్తిడి తెస్తున్నారని, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను మూసివేస్తామని బెదిరించడం ఫోర్త్ ఎస్టేట్‌కు ముప్పని అన్నారు.

అలాగే వంగవీటి రంగా హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ ఘటనకు సంబంధించిన కుటుంబాలు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నాయో ప్రశ్నించారు. రంగా గురించి విమర్శలు చేసిన గౌతమ్ రెడ్డి కు జగన్ పదవి ఇవ్వడం ఎందుకని నిలదీశారు. రంగా హత్యకు సంబంధం ఉన్న కుటుంబాలకు హైదరాబాద్‌లో భారీ ఆస్తులు కల్పించిందీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా అని ప్రశ్నించారు.

కాపు సమాజం, వంగవీటి రంగా అంశాలపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని నిమ్మల స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా కూడా ఆ పార్టీ సిగ్గు పడటం లేదని విమర్శించారు.

మొత్తానికి, “గొడ్డలి రాజకీయాలు చేసే పార్టీకీ ప్రజలు రాజకీయ సమాధి కట్టాలి” అంటూ నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు.

సినిమా

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

రాజకీయం

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

ఎక్కువ చదివినవి

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో Kiran Abbavaram తన KA Productions...

“జగదేక వీరుడు అతిలోక సుందరి”..పై నాని ఎమోషనల్ వీడియో!

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం హిట్స్‌గా మాత్రమే కాదు.. ఒక యుగంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాల్లో Jagadeka Veerudu Athiloka Sundari ఒకటి. మెగాస్టార్ Chiranjeevi హీరోగా, దివంగత...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. అయితే.. కొందరు తన పేరు వాడుకుని...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి.. సింగిల్ స్క్రీన్...