Switch to English

నిమ్మగడ్డ దొరికినట్టేనా?

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అధికార పార్టీ నేతల ఆరోపణలకు తగినట్టుగానే ఈ లేఖ వెనుక ఏదో మతలబు దాగి ఉందని నిర్ధారణ అవుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకు డీఐజీ గౌతం సవాంగ్ దీనిపై సీఐడీ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీకి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయి. నిమ్మగడ్డ వద్ద సహాయ కార్యదర్శిగా పనిచేసిన సాంబమూర్తి ఈ విచారణలో కీలకంగా మారారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. లేఖ పంపించిన తర్వాత అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. తొలుత ల్యాప్ టాప్ ఉన్న లేఖను పెన్ డ్రైవ్ ద్వారా డెస్క్ టాప్ లోకి వేసి, అక్కడ నుంచి వాట్సాప్ వెబ్ ద్వారా నిమ్మగడ్డ మొబైల్ కు పంపించారు. ఆయన దానిని కేంద్ర హోంశాఖకు ఫార్వార్డ్ చేశారని సాంబమూర్తి విచారణలో అంగీకరించారు. అనంతరం లాప్ టాప్ లో లేఖ డిలీట్ చేసి, పెన్ డ్రైవ్ ను ధ్వంసం చేశారు. డెస్క్ టాప్ ను కూడా మూడు సార్లు ఫార్మాట్ చేసినట్టు వెల్లడించారు. దీనిని బట్టి ఈ లేఖ వెనుక ఏదో గూడుపుఠాణీ ఉందని అధికార పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.

తాము చెబుతున్నట్టుగా ఈ లేఖ టీడీపీ కార్యాలయంలోనే తయారైందని వారు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రస్తుతం డెస్క్ టాప్ ను స్వాధీనం చేసుకున్న సీఐడీ అధికారులు రికవరీ టూల్స్ ద్వారా అందులోని సమాచారాన్ని వెలికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సమాచారం మొత్తం బయటకు వస్తే.. లేఖ వెనుక ఎవరి హస్తం ఉందనేది తెలుస్తుంది. నిజానికి ఈ లేఖ తొలుత టీడీపీ అనుకూల మీడియా ద్వారానే బయటకు వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న వ్యక్తి కేంద్ర హోంశాఖకు భద్రత కోరుతూ లేఖ రాసి, దానిని తన మొబైల్ ద్వారా పంపిస్తే.. మీడియాలో వచ్చే అవకాశం ఉండదు. కానీ లేఖ మొత్తం యథాతథంగా పతాక శీర్షికల్లో వచ్చేసింది. అంటే.. ఆ లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరో విడుదల చేసి ఉంటారని తెలుస్తోంది. అదే సమయంలో ఆ లేఖ మీరే రాశారా అని ఈనాడు విలేకరి అడిగితే నిమ్మగడ్డ ధ్రువీకరించలేదు.

ఏఎన్ఐ వార్తాసంస్థ అడిగినప్పుడు తాను రాయలేదని నిమ్మగడ్డ బదులిచ్చారు. మీడియాలో ఈ లేఖపై రచ్చ జరిగినన్ని రోజులు కూడా ఆయన ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కానీ లేఖపై దర్యాప్తు జరిపించాలని అధికార పార్టీ నేతలు ఫిర్యాదు చేయగానే.. తానే ఆ లేఖ రాశానంటూ నిమ్మగడ్డ స్పందించారు. ఇది కూడా కాస్త ఆలోచించాల్సిన విషయమేనని వైసీపీ నేతలంటున్నారు. పైగా ఆ లేఖ ఓ బ్యూరో క్రాట్ రాసినట్టుగా లేదు. ఫక్తు రాజకీయ పార్టీ చేసే ఆరోపణలతోనే అదంతా నిండిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ లేఖ ఎవరు రాశారనే చర్చ జరుగుతున్నా నిమ్మగడ్డ మిన్నకుండిపోయారని.. కానీ దర్యాప్తునకు ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తానే రాశానని అంగీకరించాల్సి వచ్చిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

సాధారణ ప్రక్రియలో భాగంగా నిమ్మగడ్డే ఆ లేఖ రాసి ఉంటే.. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు లేఖ నెంబరు, నిమ్మగడ్డ పంపిన లేఖ నెంబరు ఒకటే కావడం కూడా గమనించాల్సిన విషయమని పేర్కొంటున్నారు. డెస్క్ టాప్ లోని ఆధారాలు రికవరీ అయితే, అసలు నిజాలు బయటకు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఈ లేఖ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతోంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

రంజాన్‌ స్పెషల్‌: ఇఫ్తార్‌.. ఈ ఏడాదికి ఇంతే.!

ఇస్లాం మతంలో ఇఫ్తార్‌ విందుకి ఎంతో ప్రత్యేకత వుంది. రంజాన్‌ సీజన్‌లో ఇఫ్తార్‌ విందులు చాలా చాలా ప్రత్యేకమైనవి. ప్రభుత్వాలు సైతం ఇఫ్తార్‌ విందుల్ని ఏర్పాటు చేస్తుంటాయి అధికారికంగా. ముస్లింల ఓటు బ్యాంకు...

చిరు, ఎన్.టి.ఆర్ సినిమాలలో సరసన ఒకప్పటి హీరోయిన్.?

తెలుగు సినిమాలలో ప్రస్తుతం ఒకప్పటి హీరో, హీరోయిన్స్ ని, నటీనటుల్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి కాంబినేషన్స్ ని చాలా ఫ్రెష్ గా ఉండేలా డైరెక్టర్స్ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అందులో భాగంగానే...

‘పింజ్రాతోడ్‌’ యువతుల అరెస్ట్‌

గృహ హింసకు గురి అవుతున్న బాలికలను రక్షించి స్వచ్చంద సంస్థలు నిర్వహిస్తున్న హోంకు తరలిస్తూ అందరి ధృష్టిని ఆకర్షించిన పింజ్రాతోడ్‌ సంస్థ నిర్వాహకులు అయిన ఇద్దరు యువతులను పోలీసులు అరెస్ట్‌ చేయడం ప్రస్తుతం...

వారి కోసం అయినా షూటింగ్స్‌కు అనుమతించాలి : చిరంజీవి

తెలుగు సినిమా ప్రముఖులు నేడు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు విషయాలపై చర్చించారు. సినీ కార్మికులు రెండు నెలలుగా షూటింగ్స్‌...

వైఎస్‌ జగన్‌తో చిరంజీవి భేటీ.. అతి త్వరలో.!

మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో భేటీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి పలు కీలక అంశాలపై వైఎస్‌ జగన్‌తో చిరంజీవి ఈ బేటీలో చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా...