Switch to English

నిమ్మగడ్డ లేఖ రగడ: రాసింది ఆయనేనా?

ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ లేఖ వెలుగులోకి వచ్చి దాదాపు నెలరోజులు అవుతున్నా.. అది రాసింది ఎవరనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు. తాజాగా ఈ లేఖ రాసింది తానేనని.. ఇందులో ఇతరులకు ఆందోళన అనవసరమంటూ రమేశ్ కుమార్ ఖండించినట్టుగా వార్తలొచ్చాయి.

అయితే, ఆయన నేరుగా మీడియా ముందుకొచ్చి వివరణ ఇవ్వకపోవడంతో ఇందులో నిజమెంత అనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం జగన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న రమేశ్ పై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. కులం ఆపాదించి విమర్శలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఎన్నికల వాయిదాను సమర్థించింది. అయితే, ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో గతనెల 18న తనకు భద్రత కల్పించాలంటూ రమేశ్ కుమార్ కేంద్ర హోంశాఖకు 5 పేజీల లేఖ రాసినట్టుగా మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఆ లేఖ రాసింది ఆయనేనా.. కాదా అనే అంశంపై అప్పట్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఈ లేఖ రాసింది మీరేనా అని రమేశ్ ను అడిగినా.. ఆయన ధ్రువీకరించలేదు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్ఐ తో మాత్రం తాను ఆ లేఖ రాయలేదని వెల్లడించడం గమనార్హం. పైగా రమేశ్ కుమార్ సంతకానికి.. లేఖలో ఉన్న సంతకానికి భారీ తేడా ఉంది. రెండు లేఖలను పోల్చి చూస్తే ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కేంద్ర హోంశాఖ మాత్రం తమకు ఎస్ఈసీ నుంచి లేఖ అందిందని ధ్రువీకరించింది. అయితే, ఈ లేఖపై ఇంత రగడ జరుగుతున్నప్పటికీ, రమేశ్ కుమార్ మాత్రం మీడియా ముందుకు వచ్చి ఎలాంటి వివరణా ఇవ్వలేదు.

ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఈ లేఖపై దర్యాప్తు జరిపించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. లేఖలోని సంతకంలో తేడా ఉందని, ఇది టీడీపీ కార్యాలయంలో తయారైనట్టుగా ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రమేశ్ నుంచి వివరణ వచ్చినట్టుగా వార్తలొచ్చాయి. వాస్తవానికి ఆయన నేరుగా మీడియాకు ఈ విషయం చెప్పకపోవడంతో అధికార పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా లేఖ వ్యవహారం నెలరోజులుగా సాగుతున్నా.. రమేశ్ కుమార్ ఒక్కసారి కూడా ఖండించని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

ఇప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేయగానే ఈ ప్రకటన రావడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ నిజంగా రమేశ్ కుమారే ఈ లేఖ రాసి ఉంటే.. నేరుగా మీడియా ముందుకు వచ్చి చెబితే సరిపోతుంది కదా అని పేర్కొంటున్నారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఫ్లాష్ న్యూస్: ఎమ్మెల్సీ కొడుకుని అని గృహినికి టోకరా

భరత్ కుమార్ అనే వ్యక్తి తనకు తానుగా ఎమ్మెల్సీ కొడుకుగా పరిచయం చేసుకుని ఒక గృహిణిని మోసం చేసిన సంఘటన వెలుగు చూసింది. ఈ కేసును ఘట్కేసర్ పోలీసులు నమోదు చేసి విచారణ...

ఫ్లాష్ న్యూస్: ఇండియాలో చొరబడేందుకు 540 మంది ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారట

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇండియాలో ప్రవేశించి ఉన్మాదం సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండియాలో అల్ల కల్లోలం సృష్టించడమే ప్రధాన లక్ష్యంగా వందలాది మంది ఉగ్రవాదులు ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించారు. ఇప్పుడు మరో...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

రంజాన్‌పై కరోనా ఎఫెక్ట్‌: నష్టం కోట్లలోనే.!

రంజాన్‌ సీజన్‌ వచ్చిందంటే ఆ సందడే వేరు. నెల రోజులపాటు పండగ వాతావరణం కన్పిస్తుంటుంది. కరోనా వైరస్‌ దెబ్బకి రంజాన్‌ ఈసారి వెలవెలబోతోంది. ఇది హైద్రాబాద్‌ పరిస్థితి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా.. ఆ...