టాలీవుడ్ యంగ్ హీరోలు నితిన్ ఇంకా నిఖిల్‌లు ఈ నెలలో తాము చాలా కాలంగా ప్రేమించిన అమ్మాయిలను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా పెళ్లి విషయాన్ని కాస్త అటు ఇటుగా ఒకేసారి చెప్పారు. ఇద్దరు కూడా ప్రేమ వివాహమే చేసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ 16న పెళ్లికి సిద్దం అంటూ నిఖిల్ ఇప్పటికే ప్రకటించాడు. డాక్టర్ పల్లవితో హీరో నిఖిల్ పెళ్లికి హైదరాబాద్ లో ఏర్పాట్లు ప్రారంభం అయిన సమయంలో కరోనా ఎటాక్ షురూ అయ్యింది.
ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నా పెళ్లి ఆగదు. ఆంక్షలు ఉంటే గుడిలో అయినా పెళ్లి చేసుకుంటాను అంటూ నిఖిల్ ఒక మీడియా సంస్థకు చెందిన జర్నలిస్ట్‌తో చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో నిఖిల్ పరిస్థితి మరీ ఇంతగా ఉంటుందని ఊహించి ఉండడు పాపం. అందుకే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. ఇప్పుడు కనీసం గుడిలో పెళ్లి చేసుకునేందుకు కూడా పరిస్థితి లేదు. ఎందుకంటే గుడ్లు కూడా మూసేసే ఉన్నాయి. ప్రస్తుతం హాస్పిటల్స్ ఇంకా పోలీస్ స్టేషన్స్ తప్ప అన్నీ మూసే ఉన్నాయి.
ఈ సమయంలో నిఖిల్‌కు పెళ్లిని వాయిదా వేసుకోవడం తప్ప మరే మార్గం లేకుండా పోయింది. నితిన్ ఇప్పటికే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నట్లుగా ప్రకటించగా, నిఖిల్ కూడా పెళ్లి వాయిదా విషయాన్ని సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. కరోనా మహమ్మారి నుండి బయట పడ్డ తర్వాత అంతా ఆనందంగా ఉన్న సమయంలో పెళ్లి పీఠలు ఎక్కుతానంటూ స్నేహితులతో నిఖిల్ చెప్పాడట. ఈ విషయాన్ని త్వరలో ట్విట్టర్ ద్వారానో లేదంటే ప్రెస్ నోట్ ద్వారానో నిఖిల్ తెలియజేసే అవకాశం ఉంది.
205684 423335Thanks for the post, was an intriguing read. Curious as to how you came about that solution 341070
95411 418320camping have been the most effective activity that we can have during the summer, i enjoy to roast marshmallows on a campfire` 236132
680542 421788I discovered your blog website on google and verify some of your early posts. Continue to maintain up the superb operate. I merely extra up your RSS feed to my MSN News Reader. Looking for forward to reading extra from you in a even though! 714719
461648 106437I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 152755
952061 76532You produced some decent points there. I looked on the net to the problem and discovered most people goes together with along along with your site. 233699