నేటి నుంచి ఏపీలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో కోవిడ్ విస్తరణపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు.
ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. హోం కిట్‌లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. అవసరం మేర మందులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. 104 కాల్ సెంటర్‌ను సమర్ధవంతంగా పని చేసేలా చూడాలని అన్నారు.
దేవలయాలు, ప్రార్థనా మందిరాలు, దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్సులు, ధియేటర్లలో కోవిడ్ నిబంధనలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ఖచ్చితంగా ధరించేలా చూడాలని అన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధించాలని అన్నారు. సినిమా థియేటర్లలో 50 శాతం సీటింగ్ అనుమతించాలని ఆదేశించారు.
At this time for-one, so long as must visit one of the expansive casinos
to play roulette.