Nidhi Agarwal: పవన్ కల్యాణ్ హీరోగా చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నుంచి ‘కొల్లగొట్టినాదిరో..’ అనే పాట 24న విడుదల చేయబోతున్నారు. ఈసందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడుతూ..
‘ఇప్పటివరకూ నేను నటించిన సినిమాల్లో ఉత్తమమైనది హరిహర వీరమల్లు. సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కథ, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఔరంగజేబు ట్రాక్ ఒక్కటే కాదు.. సినిమాలో ఇంకా ఆకట్టుకునే కథ ఉంటుంది. కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ఇది. పవన్ గాని నటన చూసి ఆశ్చర్యపోయేదాన్ని. సన్నివేశమేదైనా మూడు నిముషాల్లో ముగించేస్తారు’.
‘మీరు చూస్తున్న కొల్లగొట్టినాదిరో.. పాట స్టిల్ పెద్ద సెట్ లో జరిగింది. పాట చాలా బాగా వస్తుంది. నా నుంచి డ్యాన్స్ మాత్రమే కాదు.. మంచి నటన కూడా చూస్తారు. స్పెషల్ సాంగ్స్, డ్యాన్సులు కూడా ఉంటాయి. షూటింగ్ త్వరలో పూర్తవుతుంద’ని అన్నారు. మార్చి 28న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత ఏ.ఎం.నిర్మాత ప్రయత్నాలు చేస్తున్నారు.