మీరు చికెన్ బాగా తింటారా.. అయితే మీకో షాకింగ్ న్యూస్. చికెన్ లో కొత్త వైరస్ వెలుగు చూసింది. కోళ్ల పిట్టల్లా రాలిపోతున్నాయి. ఏపీ, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల్లోనే ఏకంగా 40 లక్షల కోళ్లు చచ్చిపోయాయి. షెడ్డులో సడెన్ గా కోళ్లు కుప్పకూలిపోతున్నాయి. కోళ్లలో కొత్త వైరస్ సోకినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్ వల్ల ఎంత ప్రమాదం ఉంది అనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి కొన్ని నెలల వరకు చికెన్ తినకపోవడమే బెటర్ అని అధికారులు చెబుతున్నారు. షెడ్డులో ఒక్క కోడికి వచ్చిన వెంటనే.. మిగతా అన్ని కోళ్లకు వైరస్ సోకుతోంది.
వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోతున్నాయి. దాంతో పౌల్ట్రీ ఫారాల ఓనర్లు లక్షల్లో నష్టపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో అధికారులు కూడా అలెర్ట్ అవుతున్నారు. కోళ్ల శాంపిల్స్ తీసుకుని ల్యాబ్ కు పంపిస్తున్నారు. వైరస్ తో చనిపోయిన కోళ్లను ఊర్లకు దూరంగా పాతిపెట్టాలని షెడ్డు ఓనర్లకు చెబుతున్నారు. ఇప్పట్లో కొత్త వ్యక్తులను రానివ్వొద్దని.. మనుషులతో కూడా ఈ వైరస్ సోకే ఛాన్సెస్ ఉన్నాయని హెచ్చరిస్తున్నారంట.
ఇక ఈ వైరస్ తో మనుషులకు పెద్దగా ప్రమాదం లేకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. చికెన్ తినాలనుకుంటే బాగా ఉడకబెట్టిన తర్వాతనే తినాలని సూచిస్తున్నారు.