యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన “నేను మీకు బాగా కావాల్సినవాడిని”తో ప్రేక్షకులను ఆనందపరిచాడు. దివంగత ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. “నేను మీకు బాగా కావాల్సినవాడిని” ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ మరియు అద్భుతమైన ట్విస్ట్‌లతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు చిత్రం ఓ టి టి అక్టోబర్ 14 (గురువారం) నుండి అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం అక్టోబర్ 14 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు ఆహాలో అందుబాటులో ఉంటుంది.