రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో ఆస్తుల విలువ పెరుగనుంది. ఈమేరకు ప్రభుత్వం ఆస్తుల విలువను సవరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. పెంచిన విలువలు ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఆస్తుల విలువ, ప్రాంతాలను బట్టి కొనుగోలుదారులపై రిజిస్ట్రేషన్ చార్జీల భారం పడనుంది. ఇప్పటికే నగరాలు, పట్ణణాలు, అర్బన్ డెవలెప్మెంట్ ప్రాంతాల్లో ప్రతిఏటా ఆగష్టు, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి మార్కెట్ విలువను సవరిస్తున్నారు.
గతేడాది నుంచీ అన్ని ప్రాంతాలను గ్రిడ్స్ గా విభజించి మార్కెట్ విలువ పెంచేలా ప్రణాళికలు సిధ్ధమైనా కరోనా నేపథ్యంలో వాయిదా వేసింది. దీంతో 2022 మార్చి 31 వరకూ ఇప్పటివరకూ ఉన్న రేట్లే కొనసాగుతాయిని గతేడాదే ప్రకటించింది. దీంతో గ్రామాల్లో 2022 ఏప్రిల్ 1 నుంచి సవరించిన మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చేలా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బాపట్ల, నరసారావుపేట పరిధిలోని కొన్ని గ్రామాల్లో ఫిబ్రవరి 1 నుంచే పెరిగిన మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి.