ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ గా నటించిన ఎంతోమంది ఆఫ్ స్క్రీన్ లో కూడా తమ రిలేషన్ షిప్ ని కొనసాగించిన వారు ఉన్నారు. ఐతే వారి మధ్య బంధం స్ట్రాంగ్ అనుకుంటే పెళ్లికి దారి తీస్తుంది. ఇప్పటికే సెలబ్రిటీస్ చాలామంది కలిసి నటించి ఆ తర్వాత కలిసి జీవితాన్ని కూడా పంచుకున్న వారు ఉన్నారు. ఐతే లేటెస్ట్ గా టాలీవుడ్ లో ఒక హీరో తనతో నటించే హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడని టాక్.
ఆ హీరో ఎనర్జీకి అందరు ఫిదా అవుతారు. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా ఆ హీరో వరుసగా సినిమాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఆ హీరో తన లుక్కు మార్చి ఒక రొమాంటిక్ ఎంటర్టైన్ తో రాబోతున్నాడు. అందులో ఒక కొత్త హీరోయిన్ కేవలం తెలుగులో ఒక సినిమా మాత్రమే చేసిన అమ్మడు నటిస్తుంది. తను చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అయినా ఆమె గ్లామర్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.
ఐతే ఆ హీరో ఈ హీరోయిన్ ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా ప్రయాణంలో ఇద్దరి అభిప్రాయాలు కలిశాయట. ఇద్దరు డేటింగ్ లో ఉంటున్నట్టు టాక్. మరి అది పెళ్లి దాకా తీసుకెళ్లే ప్రేమేనా లేదా అన్నది చూడాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆ హీరో తన హృదయ మహారాణి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇన్నాళ్లకు ఆమె దొరికేసిందని తెలుస్తుంది. మరి ఈ హీరోయిన్ అతనితో ఏడడుగులు నడుస్తుందా లేదా అన్నది చూడాలి.