Switch to English

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్ రావడానికి కనీసం 16 నెలల సమయం పడుతుందని తెలుస్తుంది. అయితే, ఇప్పుడు వాక్సిన్ కంటే దీనిని ఎదుర్కొనే డ్రగ్ కావాల్సిన అవసరమే ఎక్కువగా ఉంది.

ఇందుకు సంబంధించి ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బాంబే ఐఐటీ ఓ వినూత్నమైన ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అసలు వైరస్ మనిషి శరీరంలోకి వెళ్లకుండా నిరోధించే ఓ జెల్ ను అభివృద్ధి చేస్తోంది. దీనిని ముక్కు వద్ద రాసుకుంటే కరోనా వైరస్ కణాలను లోనికి వెళ్లకుంటే అడ్డుకునే అక్కడే చంపేస్తుంది. ఫలితంగా అది మనిషి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉండదు. తద్వారా వైరస్ సోకదు. కరోనా వైరస్ ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండే చేయడమే తమ ఉద్దేశమని, ఈ జెల్ ను ముక్కు రంధ్రాల వద్ద పూసుకుంటే వైరస్ కణాలు లోనికి వెళ్లే అవకాశం ఉండదని బాంబే ఐఐటీలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ కి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించే ప్రాథమిక ప్రవేశ ప్రాంతం ముక్కు కాబట్టి.. తాము ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇది తొలిదశ వ్యూహం కాగా, రెండో దశలో జీవకణాల ద్వారా మనిషి లోపల ఉన్న వైరస్ ను నిర్వీర్యం చేసే దిశగా తమ పరిశోధనలు సాగనున్నట్టు తెలిపారు. బాంబే ఐఐటీకి చెందిన ప్రొఫెసర్లు కిరణ్ కొండబాగిల్, రిత్ని బెనర్జీ, అశుతోష్ కుమార్, షామిక్ సేన్ ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల పాజిటివ్ కేసులు, 88వేల మరణాలు చోటుచేసుకోవడం.. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వైరస్ నిరోధక ఔషధం తక్షణావసరమే. అయితే, బాంబే ఐఐటీ అభివృద్ధి చేస్తున్న ఈ జెల్ అందుబాటులోకి రావడానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

జనసేన యూట్యూబ్ అకౌంట్ హ్యాక్

జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆ పార్టీకి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా చేరవేస్తున్నారు. అయితే కాసేపటి క్రితం ఈ ఛానల్ హ్యాక్ అయింది....

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...