Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: లూడో – ఈ గేమ్ బాగా బోరింగ్.!

Critic Rating
( 2.00 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie లూడో
Star Cast అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా, సన్య మల్హోత్రా
Director అనురాగ్ బసు
Producer టీ సీరీస్ - అనురాగ్ బసు
Music ప్రీతమ్
Run Time 2 గంటల 30 నిముషాలు
Release నవంబర్ 12, 2020

ఈ కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు థియేటర్ రిలీజ్ ని మిస్ చేసుకొని డైరెక్ట్ ఓటిటి ద్వారా రిలీజ్ అవుతున్నాయి. ఆ జాబితాలోనే డైరెక్టర్ అనురాగ్ బసు రూపొందించిన మల్టీ స్టారర్ ఫిల్మ్ ‘లూడో’ నేడు నెట్ఫ్లిక్స్ ద్వారా రిలీజయింది. అభిషేక్ బచ్చన్, రాజ్ కుమార్ రావు, ఆదిత్య రాయ్ కపూర్, ఫాతిమా సన షైక్, సన్య మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ఎ, హిందీఎం ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. మరి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

సత్తు భయ్యా(పంకజ్ త్రిపాఠి) ఒక గ్యాంగ్ స్టర్.. తన వృత్తి పరంగా ఒక బిల్డర్ ని చంపుతాడు. ఆ హత్య చూసిన సాక్షి రాహుల్(రోహిత్ సురేష్)ని తన అడ్డాలో ఉంచుకుంటాడు. అలాగే ఈ హత్య కేసుకి అసలు సంబంధం లేకుండా తమ తమ సమస్యలతో బాధపడుతున్న ఆకాష్(ఆదిత్య రాయ్ కాపూర్), బిట్టు(అభిషేక్ బచ్చన్), అలోక్(రాజ్ కుమార్ రావు) లు సత్తు భయ్యా అడ్డాకి వస్తారు. అక్కడ జరిగిన ఆ బాంబ్ బ్లాస్ట్ మరియు సత్తు భయ్యా చేసిన బిల్డర్ మర్డర్ కేసు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి? ఆ మర్డర్ కేసులో అనుకోకుండా ఇరుక్కున్న వీళ్ళు ఎలా బయటకి వచ్చారు అన్నదే కథ.

తెర మీద స్టార్స్..

5 వేరు వేరు జీవితాలను ఒక చోటకి లింక్ చేయడమే కథ. అందుకోసం ఎంచుకున్న నటీనటులు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. ఆదిత్య రాయ్ కపూర్ – సన్య మల్హోత్రా లవర్స్ గా మంచి నటననే కనబరిచారు. రాజ్ కుమార్ రావు మాత్రం దిలీప్ కుమార్ ఇమిటేట్ చేస్తూ నవ్విస్తాడు. ఫాతిమా సన షైక్, పంకజ్ త్రిపాఠిలు తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇలా స్క్రీన్ మీద కనిపించిన అందరూ పెర్ఫార్మన్స్ పరంగా మెప్పిస్తారు.

తెర వెనుక టాలెంట్..

లూడో ని లైఫ్ కి రిలేట్ చేస్తూ కథని చెప్పిన విధానం బాగుంది. కథా పరంగా ఇలాంటి నాలుగైదు కథలని ఒకచోటికి కలపడం లేదా ఒక క్రైమ్ చుట్టూ తిప్పడం లాంటివి ఇప్పటికే చూసాం. అందువలన కథలో కొత్తదనం ఉండదు. కానీ ఒక్కో కథ ద్వారా ప్రస్తుత ప్రపంచాన్ని, ప్రపంచంలోని పరిస్థితుల్ని, మనుషుల మనస్తత్వాల్ని ప్రతిబింబించేలా అండర్ కరెంట్ గా చెప్పిన అంశాలు మాత్రం సూపర్బ్ అని చెప్పాలి. ఇకపోతే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో వెళ్లాలని కథని మొదలు పెట్టిన తీరు చాలా బాగుంది. అందువల్ల మొదటి అర్ధభాగం చాలా ఆసక్తిగా సాగుతుంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి కథనం నార్మల్ గా ప్రతి కథలోనూ ప్రేక్షకులు ఊహించిందే జరుగుతూ వెళ్తుంటుంది. అలా సెకండాఫ్ ని బోర్ కొట్టించేసాడు. పాత్రల పరిచయంలో ఉన్న ఫన్ ని అలాగే కంటిన్యూ చెయ్యడంలో ఫెయిల్ అయ్యారని చెప్పాలి. అలాగే సినిమాకి లెంగ్త్ కూడా బిగ్గెస్ట్ మైనస్.

అనురాగ్ బసు డైరెక్టర్ గా అనుకున్న పాయింట్, నటీనటుల నటన, అలాగే మ్యూజికల్ నేరేషన్ గా సినిమాని చెప్పిన విధానం చాలా బాగుంటే, మరోవైపు 1 గంట తర్వాత సినిమా స్లో అయిపోవడం, మధ్యలో ఇంకా ఎంతసేపు సాగదీస్తారు అనే ఫీలింగ్ రావడం, చివరికి వచ్చేసరికి నీరసం తెప్పించేయడం లాంటివి మైనస్. ప్రీతమ్ మ్యూజిక్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. అలాగే విజువల్స్ కూడా సూపర్బ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గ్రేట్ అని చెప్పాలి. ఎడిటర్ అజర్ శర్మ మాత్రం 30 నిమిషాలపైనే కట్ చేసి ఉన్న సినిమా ఫ్లో లో పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు, కానీ అది అలానే ఉంచేయడం వలన సినిమా రిజల్ట్ లో చాలా తేడా వచ్చేసింది.

విజిల్ మోమెంట్స్:

– నటీనటుల నటన
– ప్రతి స్టోరీలోని కీ పాయింట్స్
– ఆసక్తిగా సాగే మొదటి గంట
– ప్రీతమ్ మ్యూజిక్

బోరింగ్ మోమెంట్స్:

– బోరింగ్ గా సాగే గంటన్నర సినిమా
– కామెడీ పెద్దగా వర్కౌట్ కాకపోవడం
– ఎప్పటికీ అవ్వట్లేదు అనిపించే లెంగ్త్
– కథనం
– డైరెక్షన్
– ఎమోషనల్ కనెక్ట్ కూడా మిస్ అవ్వడం
– ఆకట్టుకొని ట్విస్టులు

విశ్లేషణ:

ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ ఆయన గేమ్ లూడో టైటిల్ తో వచ్చిన ఈ ‘లూడో’ సినిమా అంత సక్సెస్ సాధించే సినిమా కాదు. ఓపెనింగ్ చాలా ఆసక్తికరంగా మొదలు పెట్టినా, గంట తర్వాత నుంచి సినిమాని ఎన్ని రాకలుగా డిజప్పాయింట్ చేయచ్చో అన్ని రకాలుగా చేసేసారు. చివరికి సినిమా చూసే ప్రేక్షకులకి మా రెండున్నర గంటల టైం వృధా అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది. మరీ ఏ సెంటర్ ఆడియన్స్ ఎవరైనా కొంతమంది చూసి బాగుందనుకోవచ్చు కానీ వాళ్ళు కూడా ఇంత రన్ టైంని బేర్ చేయడం కష్టమే. ఇక మిగిలిన తరహా ఆడియన్స్ కి ఎలా ఉంటుందో మీఊహకే వదిలేస్తున్నా.

చూడాలా? వద్దా?: స్టార్ పవర్ ఉన్నా చూడడం చాలా కష్టం.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 2/5 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

Vijay: తల్లి కోసం ఆలయం కట్టించిన హీరో విజయ్.. కారణం ఇదే..

Vijay: ప్రముఖ తమిళ హీరో విజయ్ (Vijay) తన తల్లి కోరిక మేరకు గుడి కట్టించాడనే వార్త వైరల్ అవుతోంది. గతంలోనే ఈ వార్త ప్రచారంలోకి వచ్చినా దీనిపై ఎప్పుడూ స్పందించింది లేదు....

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...

‘జితేందర్ రెడ్డి’ మూవీ నుంచి ‘అఆఇఈ’ లిరికల్ సాంగ్ విడుదల

'ఉయ్యాల జంపాల', 'మజ్ను' చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో 'బాహుబలి' ఫేమ్ రాకేష్ వర్రే హీరోగా వైశాలి రాజ్, రియా సుమన్ హీరోయిన్లుగా 'జితేందర్ రెడ్డి'...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...