Switch to English

చైనా చిచ్చు.. భారత్ పై నేపాల్ ఓవరాక్షన్

కరోనా వైరస్ కు జన్మస్థానమైన చైనా కంటే, లక్షలాది కేసులతో అతలాకుతలమైన ఇటలీ కంటే భారత్ వల్లే తమకు ముప్పు ఎక్కువగా ఉందంటూ నేపాల్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చైనా, ఇటలీ నుంచి వచ్చే కరోనా వైరస్ కంటే భారత్ నుంచి వస్తున్న వైరస్ ప్రాణాంతకమని నేపాల్ ప్రధాని కేపీ ఓలి ఆరోపించడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే భారత్ కు చెందిన భూభాగాలను తమవిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసిన నేపాల్.. తాజాగా చైనా దన్నుతో భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.

తాజాగా ఓలి పార్లమెంటులో మాట్లాడుతూ.. తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం భారతేనని ఆరోపించారు. ‘‘నేపాల్ లోకి అక్రమ మార్గాల ద్వారా ప్రవేశిస్తున్న భారతీయుల వల్లే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. పైగా అది చైనా, ఇటలీ వైరస్ కంటే ప్రాణాంతకమైంది’’ అని పేర్కొన్నారు.

నేపాల్ తాజా చర్యలు, వ్యాఖ్యల వెనుక చైనా మద్దతు పరోక్షంగా ఉందని చెబుతున్నారు. గతేడాది అక్టోబర్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ నేపాల్ లో పర్యటించిన తర్వాత నేపాల్ వైఖరిలో మార్పు మొదలైంది. అది కాలాపాని రూపంలో బట్టబయలైంది. భారత్ కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన కాలాపాని ప్రాంతం తమదేనంటూ నేపాల్ వాదించడం ప్రారంభించింది.

అనంతరం మానససరోవర్ యాత్ర కోసం ఉత్తరాఖండ్ లోని లిపు లేక్ ప్రాంతం వరకు నిర్మించిన రహదారిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. 1816 నాటి సుగౌలి ఒప్పందం ప్రకారం ఆ ప్రాంతం తమదేననే కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా పార్లమెంటులో మాట్లాడిన ఓలి.. లిపులేక్, కాలాపాని ప్రాంతాలను తిరిగి సాధిస్తామనే తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం వెనుక డ్రాగన్ కంట్రీ ప్రోత్సాహం ఉందని తెలుస్తోంది.

నిజానికి ఈ వ్యవహారం మొత్తం చైనా కనుసన్నల్లోనే సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చైనాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీలు డ్రాగన్ కంట్రీకి గుడ్ బై చెప్పేస్తున్నాయి. వాటిలో చాలా కంపెనీలు భారత్ వైపు వచ్చే అవకాశం ఉండటంతో చైనా అందుకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సరిహద్దు వివాదాలు రెచ్చగొట్టడం ద్వారా భారత్ లోకి పెట్టుబడులు రాకుండా నిలువరించాలన్నదే చైనా వ్యూహంగా పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటు నేపాల్ తోపాటు అటు పాక్, చైనా సరిహద్దుల్లో కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది. ఇటీవల చైనా, భారత్ సైనికులు పరస్పరం బాహాబాహీకి తలపడటం, చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంలో భారత సుఖోయ్ లు రంగంలోకి దిగడం వంటి పరిణామాలన్నీ మనదేశంలోకి పెట్టుబడులు రాకుండా చేయడంలో భాగమేనని అర్థమవుతోంది. చైనా బుట్టలో పడిన నేపాల్.. కావాలనే భారత్ పై అక్కసు ప్రదర్శిస్తోంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

సఫారీలో సింహాన్ని తేలిగ్గా తీసుకుంటే కార్ డోర్ తీసేసింది.. ఆ తర్వాత..

తెలుగులో వచ్చిన ఆరెంజ్ సినిమాలో జెనీలియాను అడవికి తీసుకెళ్లి దగ్గరగా సింహాన్ని చూపిస్తాడు రామ్ చరణ్. దీంతో హీరోయిన్ అదిరిపోయి.. బెదిరిపోతుంది. అటువంటి సన్నివేశమే కాస్త డిఫరెంట్ గా సఫారీ రైడ్స్ కు...

నిశ్చితార్థ వార్తలు కొట్టి పారేసిన సురేష్‌బాబు

ఈ రోజు ఉదయం నుండి కూడా సోషల్‌ మీడియాలో రానా వివాహ నిశిత్చార్థం అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. తాను ప్రేమించిన అమ్మాయి మిహీకా బజాజ్‌తో రానా వివాహ నిశ్చితార్థం...

క్రైమ్ న్యూస్: కాటికెళ్లే వయసులో బాలికపై అత్యాచారం.!

బాలికలపై అత్యాచారాలను అరికట్టాలని ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా ఇంకా వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటువంటి ఓ దురాగతం సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం పంచాయితీలోని కిష్టయ్యపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో కుటుంబంతో కలిసి...

క్రైమ్ న్యూస్: కూతురు ప్రేమలో పడినందుకు శిక్షగా రేప్‌ చేసిన తండ్రి.. తల్లి సహకారం

నలుగురికి చదువు చెప్పాల్సి ఉపాధ్యాయుడు, నలుగురికి మంచి మార్గం చూపించే ఉపాధ్యాయుడు తన కన్న కూతురుపై అఘాయిత్యంకు పాల్పడటం సంచలనంగా మారింది. మద్యప్రదేశ్‌లో మోరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 45 ఏళ్ల...