బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి హీరోగా ఎయిర్ టెల్ యాడ్ తో పాపులర్ అయిన సశా చెత్రి ఫిమేల్ లీడ్ గా నటించిన సినిమా నేనెక్కడున్నా. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మాధవ్ కోదాడ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ను ప్రజా నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లడుతూ.. జర్నలిజం విలువలు, మహిళా సాధికారతపై తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని అన్నారు. దర్శకుడు మాధవ్ కోదాడ, నిర్మాతలు మారుతి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కెబీఆర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.
నేనెక్కడున్నా సినిమాలో మిమో చక్రవర్తి ఆనంద్ పాత్రలో నటిస్తుండగా సశా చెత్రి ఝాన్సీగా నటించారు. సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు జర్నలిస్టులుగా నటించారు. జీతం కోసం కాకుండా జనాల జీవితం కోసం పాత్రికేయ రంగాన్ని ఎంచుకునే ఆనంద్, ఝాన్సి చేసిన స్టింగ్ ఆపరేషన్స్ ఎలా సాగాయి.. అవినీతి నేతల బాగోతాలు ఎలా బయటపడ్డాయి అన్నది సినిమా కథ.
ఈ సినిమాలో మురళి శర్మ, మహేష్ మంజ్రేకర్, ప్రదీప్ రావత్, షయాజి షిండే, బ్రహ్మానందం, అభిమన్యు సింగ్, రాహుల్ దేవ్, తణికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, భాను చందర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించగా జయపాల్ నిమ్మల సినిమాటోగ్రఫీ అందించారు.