నెల్లూరు నగరాన్ని కుదిపేసిన సీపీఐ కార్యకర్త పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా పేరొచ్చిన లేడీ డాన్ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బోడిగానితోటలోని ఆమె నివాసంపై పోలీసులు భారీగా దాడులు నిర్వహించి, ఇంట్లో దాచిన 25 కేజీల గంజాయి, కీలకమైన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
కామాక్షికి ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో బయటపడిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం పెంచలయ్యను కత్తులతో పొడిచి హత్య చేసిన ముఠాలో మొత్తం తొమ్మిది మంది ఉన్నట్లు గుర్తించారు.
స్థానికంగా పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా పని చేస్తున్న పెంచలయ్య ముఠా సభ్యులకు వ్యతిరేకంగా కీలక సమాచారాన్ని అందిస్తుండటంతో, కామాక్షి ముఠాతో కలిసి పథకం ప్రకారం అతడిని హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ కేసుతో నెల్లూరులో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విచారణ వేగవంతం చేసి, ఇందులో ఉన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు.
