Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ( Balakrishna),అనిల్ రావిపూడి( Anil Ravipudi)కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకి ‘భగవంత్ కేసరి( Bhagavanth Kesari) ‘ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. జూన్ 10 న బాలయ్య పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు చిత్ర బృందం టైటిల్ ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
సినిమా టైటిల్ లో నేషనల్ ఎంబ్లెమ్ కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో టైటిల్ పేరుతోనే ఆయన పాత్ర ఉంటుంది. తండ్రి కూతుర్ల ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్ ఈ సినిమా రూపొందుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బాలయ్య దుర్గామాత భక్తుడిగా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల( Sree leela)నటిస్తోంది. కాజల్ అగర్వాల్( Kajal Agarwal)హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు.ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.