గ్లామర్ పాత్రలకు రెడీ అంటున్న నయనతార

గ్లామర్ పాత్రలకు రెడీ అంటున్న నయనతార

సౌత్ లేడి సూపర్ స్టార్ గా మంచి ఇమేజ్ అందుకున్న నయనతార అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉందొ అందరికి తెలుసు. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. అటు స్టార్ హీరోలు, ఇటు కుర్ర హీరోలు అన్న బేధం లేకుండా తనకు స్క్రిప్ట్ నచ్చితే చాలు సినిమా చేయడానికి రెడీ అయింది. అయితే ఈ మద్యే నయనతారపై పలువురు నిర్మాతలు కామెంట్స్ చేయడం పెద్ద దుమారమే రేగింది.

నయనతార రెమ్యూనరేషన్ చుక్కల్లో ఉంటుందని, ఆమెకు ఇచ్చేదానికంటే కూడా ఆమెను మైంటైన్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందని పలువురు నిర్మాతలు ఆరోపించడంతో నయనతారపై నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది.

సినిమాకోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కానీ ప్రమోషన్స్ కు రాదు, ఇలా చాలా రకాలుగా నయనతారపై నెగిటివ్ ని ప్రచారం చేస్తుండడంతో .. ఆమెకు కొత్త అవకాశాలు రావడం లేదు. దానికి తోడు .. పాత్రల విషయంలో కూడా కండిషన్స్ పెట్టడం నేను గ్లామర్ పాత్రలు చేయను, హీరోకి తక్కువగా నా పాత్ర ఉండొద్దు అంటూ రకరకాల కండిషన్స్ పెట్టడం, అవన్నీ ఒక్కసారిగా రచ్చ అవ్వడంతో .. నయనతార ఆలోచనలో పడిందట ..

ఇకపై కొత్త సినిమాల నిర్మాతలకు మంచి ఆఫర్స్ ఇచ్చిందట, పారితోషికం విషయంలో డిమాండ్ చేయనని, అంతే కాదు రొమాన్స్, గ్లామర్ పాత్రలకు కూడా ఓకే అని చెబుతుందట, ఇందులో మరో విశేషం కూడా ఉందండోయ్.. అదేమిటంటే .. ఈ అమ్మడు లిప్ లాక్ లకు కూడా రెడీ అని అంటుందట .. నయనతార ఒకేసారి ఇన్ని ఆఫర్స్ ఇస్తే నిర్మాతలు ఊరుకుంటారా ? నయనతారను హీరోయిన్ గా బుక్ చేసేందుకు ఎగబడుతున్నారట.

కెరీర్ మొదట్లో నయనతార గ్లామర్ పాత్రల్లోనే రాణించింది, అయితే ఆ మధ్య మూడు ప్రేమాయణాలు.. బ్రేక్ అప్ లు కావడంతో గ్లామర్ విషయం పక్కన పెట్టి .. మంచి కథలైతే తప్ప చేయనని కండిషన్స్ పెట్టడం .. వరుస సినిమాలు హిట్ అవ్వడంతో కండిషన్స్ ఇంకా ఎక్కువ కావడం, ఇలా జరిగిపోయాయి, మరి నయనతార గ్లామర్ కు రెడీ అన్నదంటే .. మిగతా హీరోయిన్స్ కు నిజంగా బ్యాండే !!