హీరో ధనుష్ వర్సెస్ నయన తార వివాదం పీక్స్ కు వెళ్తోంది. ఇద్దరూ బహిరంగంగా మాట్లాడకపోయినా.. ఒకరిపై ఒకరు చర్యలకు దిగుతున్నారు. ఇప్పటికే ధనుష్ తన నానుమ్ దాన్ రౌడీ విజువల్స్ ను వాడుకోవడంపై నయన తార మీద సీరియస్ అయ్యారు. దీనిపై ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు. అయితే దానిపై తాజాగా నయన తార తరఫున లాయర్ స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నానుమ్ దాన్ రౌడీ విజువల్స్ కు సంబంధించినవి కావు అవి బీటీఎస్ కు సంబంధించినవి. అవి ఉల్లంఘన కిందకు రావు అని తెలిపారు.
కాగా దీనిపై కోర్టు విచారణ వాయిదా వేసింది. ధనుష్ తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని విజువల్స్ ను ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకున్నారని నయనతార, విఘ్నేష్ మీద అలాగే వారి నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్ పై దావా వేశారు. తన పర్మిషన్ లేకుండా విజువల్స్ ను వాడుకున్నారని వెంటనే తొలగించాలని ధనుష్ డిమాండ్ చేశారు. కానీ దానిపై నయన తార తీవ్ర ఆగ్రహం తెలిపారు. ధనుష్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. 3 సెకన్ల వీడియో కోసం 10 కోట్లు తీసుకోవడం దుర్మార్గం అని తెలిపారు.
ధనుష్ క్యారెక్టర్ ను కూడా తప్పుబట్టారు. దాంతో వార్ పీక్స్ కు వెళ్లిపోయింది. ఆమె వ్యాఖ్యలపై ధనుష్ మాట్లాడకుండా డైరెక్టుగా కోర్టులో దావా వేసేశారు. ఇంకేముంది గొడవ కాస్త కోర్టు మెట్ల వరకు వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు ధనుష్.