Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార సినీ ప్రస్థానం గురించి తెలిసిందే. ఇప్పటికీ స్టార్ స్టేటస్ లో కొనసాగుతున్న అతితక్కువ మంది హీరోయిన్లలో ఆమె ఒకరు. హీరోయిన్ గా తెరంగేట్రం నుంచి అంచెలంచెలుగా స్టార్ స్టేటస్ అందుకుని దక్షిణాద భాషల్లో స్టార్ హీరోయిన్, నెంబర్ వన్ హీరోయిన్ గా కూడా కొనసాగారు.
ఆమె జీవితం, సినీ కెరీర్ పై ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోందని గతంలోనే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దీనిని రూపొందించడం విశేషం. డాక్యుమెంటరీ పూర్తవడతంతో త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈక్రమంలో డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ చేసింది.
నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న డాక్యుమెంటరీలో ఆమె చేసిన సినిమాలు, తోటి నటీనటులు, ఆమె ప్రేమ, వివాహం.. జీవితంపై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నాగార్జున, రానా.. ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడిందని చెప్పిన క్లిప్స్ వీడియోలో ఆకట్టుకుంటున్నాయి.