Switch to English

నయనతార కనెక్ట్ మూవీ రివ్యూ…

Critic Rating
( 2.75 )
User Rating
( 2.70 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

నయనతార ప్రధాన పాత్రలో కనిపించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అశ్విన్ శరవణన్ ఈ చిత్రానికి దర్శకుడు. మరి కనెక్ట్ ఎలా ఉందో చూద్దామా…

కథ:

జోసెఫ్, సుసాన్ హ్యాపీ కపుల్. వీరికి అన్నా కూతురు. వీరు ముగ్గురూ తమ జీవితాలను సంతోషంగా గడుపుతుంటారు. అయితే దురదృష్టవశాత్తూ కరోనా వైరస్ కారణంగా జోసెఫ్ చనిపోతాడు.

తండ్రిపై విపరీతమైన ప్రేమ ఉన్న అన్నా తన తండ్రిని మిస్ అవుతుంది. అందుకే తనను కనెక్ట్ అవ్వడానికి జోసెఫ్ ఆత్మను ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంది. అయితే అంతటి ప్రమాదకరమైన ప్రయత్నం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్నాను సుసాన్ కాపాడుకోగలిగిందా లేదా అన్నది చిత్ర ప్రధాన కథాంశం.

నటీనటులు:

కనెక్ట్… నయనతార షో అని చెప్పవచ్చు. తల్లిగా నయన్ అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. సుసాన్ పాత్రలో జీవించింది నయనతార. ఆమెతో చిత్రంలో మనం కూడా ట్రావెల్ అవుతాం అంటే అది తన పెర్ఫార్మన్స్ వలెనే అని చెప్పవచ్చు.

నయనతార తండ్రిగా సత్యరాజ్ కనిపిస్తాడు. తన కూతురిని, మనవరాలిని కాపాడుకునే పాత్రలో కనిపించాడు. తన పెర్ఫార్మన్స్ కూడా సూపర్బ్ గా ఉంది. వినయ్ రాయ్ కు పెద్ద పాత్రేమీ దక్కలేదు. కానీ ఉన్నంతలో ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మరో ముఖ్య పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్ కూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు.

ఇక నయన్ కూతురిగా నటించిన హానియా నఫీస్ చిత్రానికి మరో మెయిన్ హైలైట్ గా నిలిచింది. మిగతా వారంతా చిత్రంలో తమ పాత్రలకు తగ్గట్లు కనిపించారు.

సాంకేతిక నిపుణులు:

అశ్విన్ శరవణన్ తీసుకున్న కథ మనం ఇప్పటికే వందలాది హారర్ కథలలో చూసింది. అయితే స్క్రీన్ ప్లే టైట్ గా రాసుకోవడంలో మాత్రం అశ్విన్ సక్సెస్ అయ్యాడు. చిత్రంలో హారర్ ఎలిమెంట్స్ ను చక్కగా డిజైన్ చేసాడనే చెప్పాలి. అయితే చిత్రంలో ఏం జరుగుతుంది అనే సస్పెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చిత్రానికి మేజర్ డ్రాబ్యాక్.

హారర్ సినిమాలకు కావాల్సిన రీతిలో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కుదిరాయి. కీలకమైన సీన్స్ ను ఎలివేట్ చేయడంలో ఇవి కీలక పాత్ర పోషించాయి.

ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. ఇక ప్రొడక్షన్ డిజైన్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

  • నయనతార నటన
  • హానియా నఫీస్ నటన

మైనస్ పాయింట్స్:

  • రొటీన్ స్టోరీలైన్

విశ్లేషణ:

కథ రోటీన్ గానే ఉన్నా కానీ హారర్ ఎంటర్టైనర్ నుండి ఏం ఆశిస్తామో అవి ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది మర్చిపోయి ఇన్వాల్వ్ అయిపోతాం. మీరు కనుక హారర్ చిత్రాలను ఇష్టపడే వారైతే ఈ కనెక్ట్ మీకు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ బడ్జెట్‌ తో...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా ముందుకు తీసుకెళ్తే సమాజం శెభాష్ అంటుంది....