అవును.. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ చాలా ఆకతాయిలు అంట. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు సౌత్ స్టార్ హీరోయిన్. మామూలు వాళ్లు ఈ కామెంట్స్ చేస్తే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఈ కామెంట్స్ చేసింది నయనతార. ఆమె వీరిద్దరితో కూడా సినిమాలు చేసింది. రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్, ప్రభాస్ గురించి స్పందించింది. నేను 2010లో అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ తో నటించాను. ఆ సినిమాను ఓ సీన్ కోసం నేను టచ్ అప్ లాంటిది వేసుకుంటున్నాను.
అయితే పక్కనే ఉన్న ఎన్టీఆర్ నన్ను అదే పనిగా చూస్తున్నాడు. దాంతో నాకు డౌట్ వచ్చింది. నా టచ్ అప్ లో ఏదైనా తప్పు ఉందా అని అనుకున్నాను. తర్వాత అతన్ని ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాను. మీరు టచ్ అప్ వేసుకుని వేస్ట్. ఎందుకంటే ఈ సీన్ లో అందరూ నన్ను మాత్రమే చూస్తారు అటూ కామెంట్ చేశాడు. దాంతో నాకు చాలా నవ్వొచ్చింది. ఇక ప్రభాస్ తో యోగి సినిమాలో నటించాను. ప్రభాస్ చాలా స్వీటెస్ట్. ఎలాంటి ఆటిట్యూడ్ లేదు. సెట్ లో ఉన్నంత సేపు ఇటు అటు దూకి చాలా జోకులు పేల్చుతూ ఉండేవాడు.
అతని మనస్తత్వం ఒక పసిపిల్లవాడిలా ఉంటుంది. ఒక రకంగా చిన్న ఆకతాయిలా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాస్ ఇంత పెద్ద స్టార్ కావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేసింది నయనతార. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
Usually I don’t rread article oon blogs, butt I wojld like tto
ssay that ths write-up very coompelled mme tto take a
look aat and ddo so! Youur writinbg style hass bren amazed
me. Thaqnk you, quiite ggreat post.