ముందస్తు లీకులే నిజమయ్యాయి. నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని ఎలిమినేట్ అయిపోవడం ఒకింత ఆశ్చర్యకరమే. ఇక్కడ ఓటింగ్‌తో అస్సలు సంబంధమే లేదు. అదో డ్రామా అంతే.
నిజానికి, హౌస్‌లో నయని పావని కంటే తక్కువ ఫాలోయింగ్ వున్న కంటెస్టెంట్లు చాలామందే వున్నారు. నయని పావని బాగానే పీఆర్ సెట్ చేసుకుని హౌస్‌లోకి ఎంటర్ అయినా, ప్రయోజనం లేకుండా పోయింది. ఆ మాటకొస్తే, ఈ సీజన్‌లో బీభత్సంగా పీఆర్ చేసుకుని వచ్చింది సోనియా. ఆమె అనూహ్యంగా ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే.
ఓటింగ్ ప్యాటర్న్ గురించి బిగ్ బాస్ నిర్వాహకులు అస్సలు వెల్లడించడంలేదు. ఎలిమినేటెడ్.. అంటూ కంటెస్టెంట్లను ఔట్ చేసుకుంట పోతున్నారంతే. దాంతో, బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోతోంది ఆడియన్స్‌లో.
ఇదిలా వుంటే, ఈ వీక్ ఎలిమినేషన్‌కి సంబంధించి ఫైనల్ రేసులో హరితేజ, నయని పావని మిగిలారు. ఇద్దరిలో నయని పావని ఎలిమినేటెడ్.. అని ముందే విషయం లీక్ అయ్యింది. అదే నిజమయ్యింది కూడా. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నయని పావనితో పోల్చితే హరితేజకే తక్కువ ఓట్లు పోలయ్యాయట.
ఇవి అనధికారిక పోల్స్ చెబుతున్న విషయాలు. ఒకటి, రెండు కాదు.. పది పాతిక పోల్స్‌లో ఇదే ప్రూవ్ అయ్యింది. కానీ, హరితేజను వుంచి నయని పావనిని మాత్రమే ఎందుకు గెంటేసినట్లు.? అంటే, హరితేజకి హౌస్‌లో అదనపు టాస్క్‌లు ముందే డిజైన్ చేశారు కాబట్టి.. అని అంటున్నారు.
హరితేజ, ఈ సీజన్‌లో చివరి వరకు వుంటుందన్నది తాజాగా బిగ్ బాస్ వర్గాల నుంచి అందుతున్న లీకుల సారాంశం.