Switch to English

ఓటిటి మూవీ రివ్యూ: రాత్ అకేలి హై – థ్రిల్స్ లేని పరమ బోరింగ్ మర్డర్ మిస్టరీ.!

Critic Rating
( 1.50 )
User Rating
( 0.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow
Movie రాత్ అకేలి హై
Star Cast నవాజుద్దీన్ సిద్దిఖ్, రాధిక ఆప్టే, శ్వేత త్రిపాఠి
Director హనీ ట్రెహన్
Producer అభిషేక్ చౌబే, రోనీ స్క్రూవాలా
Music స్నేహ కాన్వాల్కర్
Run Time 2 గంటల 30 నిముషాలు
Release జూలై 31, 2020

నెట్ ఫ్లిక్స్ లో వరుసగా సీరీస్ లు చేస్తున్న నవాజుద్దీన్ సిద్దిఖీ – రాధిక ఆప్టే ల నుంచి వచ్చిన మరో మర్డర్ మిస్టరీ మూవీ ‘రాత్ అకేలి హై’. కోవిడ్ – 19 వలన ఇంట్లోనే ఉండిపోయిన ప్రేక్షకులను ఎంత వరకూ ఈ సినిమా ఎంటర్టైన్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

ఉత్తరప్రదేశ్ లోని ఓ రాజా ఫ్యామిలీకి చెందిన రఘువీర్ సింగ్ తన రెండవ పెళ్లి రోజు, పెళ్ళైన కాసేపటికే అనుమానాస్పదంగా మర్డర్ చేయబడతాడు. ఆ ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ జటిల్ యాదవ్(నవాజుద్దీన్) రంగంలోకి దిగుతాడు. ఆ పెళ్లి రోజు రాత్రి ఆ ఇంట్లోకి కొత్తగా ఎవరూ రారు.. దాంతో ఇంట్లోని వారు, బంధువులే చంపేసి ఉంటారని అందరి మీద అనుమానంతో కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు జటిల్ యాదవ్. ఆ మర్డర్ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేదే మిగిలిన కథ.

తెర మీద స్టార్స్..

తెరపై కనిపించిన వారి పరంగా వీరు సరిగా నటించలేదు అనేలా ఎవ్వరూ చేయలేదు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల పరిధి మేర ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా పండించారు. ముఖ్య పాత్రలు పోషించిన వారిలో కాస్త బలుపున్న ఇన్స్పెక్టర్ పాత్రలో నవాజుద్దీన్ చాలా బాగా చేశారు. ముఖ్యంగా ఎక్కడా ఓవర్ అవ్వకుండా ప్రతి సందర్భంలోనూ సెటిల్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చి పాత్రకి మరింత బలాన్ని చేకూర్చాడు. రాధిక ఆప్టే కూడా చాలా బాగా చేసింది. ఉన్నంతలో కథని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో తన వంతు నటనతో సపోర్ట్ చేసింది.

తెర వెనుక టాలెంట్..

కథ పరంగా చూసుకుంటే హాలీవుడ్ ఫిలిం ‘నైవ్స్ అవుట్’ సినిమా స్పూర్తితో సేమ్ సెటప్ లో ఈ కథని నడిపించారు. కానీ కథలోని మెయిన్ ఎలిమెంట్ ని మాత్రం ఇక్కడి పరిస్థితులకి తగ్గట్టు మార్చింది రైటర్ స్మిత సింగ్. కానీ కథ పరంగా చెప్పిన పాయింట్ కావచ్చు, కథలోని ఎమోషన్స్ కావచ్చు కనెక్ట్ అయ్యేలా లేకపోవడం, ఇప్పటికే మనం చాల సార్లు చూసేసి ఉండడం మొదటి మైనస్. ఇక కథనం పరంగా చూసుకుంటే.. ఇదొక మర్డర్ మిస్టరీ ఫిల్మ్.. అనగా మొదటి 10 నిమిషాల్లో చూపించిన క్రైమ్ కి ఆడియన్స్ చివరి వరకూ కనెక్ట్ అయ్యి, ఆధ్యంతం ఉత్కంఠగా నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది అనే ఫీల్ ని ఇవ్వగలిగితేనే ఈ జానర్ సినిమాలు సక్సెస్ అవుతాయి. కానీ ఈ సినిమాలో క్రైమ్ కి పెద్దగా కనెక్ట్ అవ్వము, నో థ్రిల్స్, అందునా ప్రీ క్లైమాక్స్ లో రివీల్ చేసే ట్విస్ట్ లలో కూడా పెద్ద కిక్ ఉండకపోవడంతో మరింత బోరింగ్ గా ఉంటుంది. థ్రిల్లర్ సినిమా అంటే కథనం పరిగెత్తాలి కానీ ఇక్కడ నత్త నడక కన్నా స్లోగా సాగుతుంది, ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో అబ్బా పోలీసోడు ఏమన్నా పట్టాడా పాయింట్ అనేలా ఒక్క సీన్ కూడా ఉండదు. ఇక డైరెక్టర్ గా హనీ ట్రెహన్ కి మొదటి సినిమా.. నటీనటుల్ని డీల్ చేయడంలో, విజువల్ ఇమాజినేషన్ పరంగా ఫుల్ మార్క్స్ కొట్టేసాడు.. కానీ ఆడియన్స్ ని సినిమా నుంచి పక్కకి వెళ్ళనీయకుండా చేయడంలో ఫెయిల్ అయ్యాడు. మొదటి 15 నిమిషాల తర్వాత మనం అలా వదిలేసి గంట బయట తిరిగొచ్చినా కథలో పెద్దగా ముందుకెళ్లదు.

పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ది బెస్ట్ వర్క్ అనిచెప్పాలి . స్నేహ కాన్వాల్కర్ మ్యూజిక్ జస్ట్ ఓకే. శ్రీకర్ ప్రసాద్ లాంటి ఎడిటర్ ఈ సినిమా ఎడిట్ విషయంలో ఇంకాస్త స్ట్రిక్ట్ గా ఉండి, 150 నిమిషాల సినిమాని కనీసం 20 నిమిషాల్లో చెప్పగలిగి ఉంటే ఇంకాస్త బెటర్ ఫీల్ ఉండేదేమో..

విజిల్ మోమెంట్స్:

– నవాజుద్దీన్ పెర్ఫార్మన్స్
– పరవాలేధనిపించే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్

బోరింగ్ మోమెంట్స్:

– కిక్ లేని కథ
– నీరసం తెప్పించే కథనం
– థ్రిల్స్ లేని థ్రిల్లర్
– 150 నిమిషాల నిడివి
– చాల సార్లు చూసేసిన కాన్ఫ్లిక్ట్
– ఎడిటింగ్

విశ్లేషణ:

ఎక్కువ సాగదీయకుండా ఒక్క పాయింట్ లో చెప్పాలంటే.. మర్డర్ మిస్టరీ జానర్ కి సంబందించిన సినిమా ‘రాత్ అకేలి హై’. థ్రిల్లర్ బేస్డ్ మర్డర్ మిస్టరీలో ఉండాల్సిన కనీస థ్రిల్స్, ఉత్కంఠత ఈ సినిమాలో లేనందున, ఆ జానర్లో మూవీ ఎలా తీయకూడదు అని చెప్పడానికి ఈ సినిమాని ఉదాహరణగా చెప్పచ్చు.

చూడాలా? వద్దా?: చుడాలనిపిస్తే ఇది స్కిప్ చేసి, ఒరిజినల్ వెర్షన్ ‘నైవ్స్ అవుట్’ చూడండి. మీ టైంకి వాల్యూ ఉంటుంది.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్ : 1.5/5 

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

ఎక్కువ చదివినవి

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...