Switch to English

నవీన్ పోలిశెట్టి ‘జాతి రత్నాలు’ మూవీ రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 4.00 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow
Movie జాతి రత్నాలు
Star Cast నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ
Director అనుదీప్ కెవి
Producer నాగ్ అశ్విన్
Music రాధన్
Run Time 2h 25m
Release 11 మార్చి 2021

‘ఏజంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’తో హిట్ అందుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో స్వప్న సినిమాస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ నిర్మించిన సినిమాలోని పాటలు, ట్రైలర్ హిట్ అవ్వడంతో పాటు, ప్రభాస్ లాంటి హీరో ప్రమోట్ చేయడం వలన సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం అన్న ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను నవ్వించిందో చూద్దాం..

కథ:

జోగి పెట్ లో ఏ పనీ పాటాలేని నెంబర్ 1 బేవార్స్ గాళ్ళు మన జాతిరత్నాలు అలియాస్ శ్రీకాంత్ (నవీన్ పోలిశెట్టి), శేఖర్ (ప్రియదర్శి), రవి (రాహుల్ రామకృష్ణ). పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు హైదరాబాద్ లో సెటిల్ అయిన వాళ్ళ ఫ్రెండ్ ని చూసి జాబ్ కోసం ఈ ముగ్గురు హైదరాబాద్ వస్తారు. కానీ హైదరాబాద్ లో వాళ్ళ ఫ్రెండ్ నిజస్వరూపం తెలియగానే షాక్ అవుతారు. ఎలాగోలా ఆ ఫ్రెండ్ వాళ్ళ ఒక కాస్ట్లీ గ్రేటెడ్ కమ్యూనిటీలో సెట్ అవుతారు. అక్కడ శ్రీకాంత్ చిట్టి(ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. తన పరిచయంతో ఈ ముగ్గురు ఓ పార్టీకి వెళ్తారు. ఆ పార్టీలో ఎంఎల్ఏ మురళీ శర్మపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఆ కేసులో శ్రీకాంత్ అండ్ ఫ్రెండ్స్ ని జైల్లో వేస్తారు. అక్కడి నుంచీ వాళ్ళు ఆ మర్డర్ చేశారా? లేక ఎవరన్నా వాళ్ళని ఇరికించారా? ఒకవేళ ఇరికిస్తే ఎందుకు ఇరికించారు? ఏ విషయాన్ని సీరియస్ గా తీస్కొని ఈ జాతి రత్నాలు ఈ కేసు నుంచి బయట పడ్డారా లేదా? అసలు ఎందుకు ఎమ్మెల్యేని చంపాలనుకున్నారు? అనేదే కథ.

తెరమీద స్టార్స్..

మరోసారి నవీన్ పోలిశెట్టి మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కనబరిచాడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నవీన్ పోలిశెట్టి నటన, తెలంగాణ యాస, కామెడీ టైమింగ్, ఎక్స్ ప్రెషన్స్ ఇలా ప్రతీది మనల్ని నవ్విస్తూనే ఉంటాయి. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది రాహుల్ రామకృష్ణ పాత్ర ఎక్కువగా నవ్విస్తుంది. తన వన్ లైనర్స్ బాగా పేలాయి. ప్రియదర్శి పాత్ర చాలా సేపు ఉన్నా పేలిన డైలాగ్స్ మాత్రం కొన్నే ఉండడం వలన కాస్త తక్కువ రిజిష్టర్ అయ్యాడు. ఇక కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకి చాలా మంచి డెబ్యూ ఫిలిం అని చెప్పచ్చు. అలాగే క్యూట్ లుకింగ్ పాత్రలో కుర్రకారుని మాయ అయితే చేస్తుంది. మురళి శర్మ ఇచ్చిన పాత్రకి న్యాయం చేశారు. గెస్ట్ పాత్రల్లో కీర్తి సురేష్, విజయ్ దేవరకొండలు ఓ మంచి ఫీల్ ని జెనరేట్ చేస్తారు. వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపే కావడం వలన పెద్దగా ఇంపాక్ట్ లేదు.

తెర వెనుక టాలెంట్..

డైరెక్టర్ అనుదీప్ కెవి చాలా క్లారిటీగా కథ అనే పాయింట్ ని పెద్దగా పెట్టుకోకుండా మొదటి నుంచి చివరి దాకా నవ్వించి బయటకి పంపేయాలి అనుకున్నాడు. అందులో భాగంగా రాసుకున్న మూడు పాత్రలు చాలా బాగున్నాయి. ఆ పాత్రలకి సరైన నటులు దొరకడంతో కామెడీ బాగా ఎలివేట్ అయ్యింది. మొదటి 10 -15 నిమిషాలు కాస్త స్లో అనిపించినా ఆ తర్వాత మొదలయ్యే కామెడీతో నవ్విస్తూ ఫస్ట్ హాఫ్ లాగించేసాడు. కానీ సెకండాఫ్ కాస్ట్ డౌన్ అవుతూ వస్తుంది. మధ్య మధ్యలో కామెడీ ఓకే అనిపించినా ఓవరాల్ గా లాగ్ అవుతుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. కచ్చితంగా ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ ఉన్న ఫీల్ సెకండాఫ్ లో ఉండదు. కథ అనేదే లేకపోవడం వలన చాలా సీన్స్ లో కామెడీ సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ని కూడా కన్ఫ్యూషన్ కామెడీతో ఫినిష్ చేయాలనుకుని చేసిన ప్రయత్నం అంతగా మెప్పించలేదు. కానీ ట్విస్ట్ రివీల్ చేసే పాయింట్ కాస్త నవ్వు తెప్పిస్తుంది. డైరెక్టర్ గా అనుకున్నది తీసాడు కానీ సెకండాఫ్ కథనం మీద, ఫన్ మీదా ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే బాగుండేది.

చిట్టి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో విజువల్స్ కూడా అంతే బాగున్నాయి. అలాజె కామెడీకి తగ్గట్టుగా నేపధ్య సంగీతం, విజువల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్ ని కాస్త ట్రిమ్ చేయాల్సింది. నాగ్ అశ్విన్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– నవీన్ పోలిశెట్టి అండ్ రాహుల్ రామ కృష్ణ ఫన్
– వన్ లైన్ డైలాగ్స్
– నవ్వించే కంటెంట్
– సరదాగా వెళ్లిపోయే ఫస్ట్ హాఫ్

బోరింగ్ మోమెంట్స్:

– అసలు స్టోరీ ఉందా అనిపించే స్టోరీ లైన్
– సాగదీసిన సెకండాఫ్ సీన్స్
– సీరియస్ సీన్స్ లో కూడా సిల్లీ కామెడీ చేయడం

విశ్లేషణ:

సూపర్బ్ బజ్ తో, స్టార్ట్ టు ఎండ్ ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పుకొని రిలీజైన జాతి రత్నాలు సినిమా ఫస్ట్ హాఫ్ చాలా హాయిగా, కడుపుబ్బా నవ్వుకునేలా ఉంటుంది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలు సూపర్బ్ పెర్ఫార్మన్స్ కనబరచడంతో వావ్ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి కథ ఉండదు. కామెడీ రాను రాను డౌన్ అవుతుండడంతో సాగదీస్తున్నారు టేంటి అనీ ఫీలింగ్ వస్తుంది. కొన్ని చోట్ల సీరియస్ గా చెప్పాల్సిన సీన్స్ లో కూడా అకామెడీ చేసేయడం కనెక్ట్ కాదు. ఓవరాల్ గా జాతి రత్నాలు సినిమా చూసి ఎక్కువగా నవ్వుకొని, కొంత డిజప్పాయింట్ మెంట్ తో బయటకి వస్తారు.

చూడాలా? వద్దా?: యూత్ అయితే సినిమా ఎంజాయ్ చేస్తారు కానీ మిగతా వారికి మిక్స్డ్ ఫీలింగ్ ఇస్తుంది.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.75/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tillu Square: ”100 కోట్లు వసూలు చేస్తుంది’ టిల్లు స్క్వేర్ పై...

Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ (Anupama) హీరోహరోయిన్లుగా మల్లిక్‌ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' (Tillu Square) నేడు విడుదలై...

Sreeranganeethulu: ‘శ్రీరంగనీతులు’ ట్రైలర్ విడుదల..

Sriranga Neethulu: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌ ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘శ్రీ‌రంగనీతులు' (Sriranga Neethulu). రాధావి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మించగా.....

Vijay Devarakonda: పార్టీ కావాలన్న రష్మిక..! విజయ్ దేవరకొండ రిప్లై ఇదే..

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా తెరకెక్కిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star). పరశురామ్ దర్శకత్వంలో...

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

రాజకీయం

Tdp: పెండింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ

Tdp: త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ (Tdp) 144 స్థానాల్లో పోటి చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించగా 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్ధులను...

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

ఎక్కువ చదివినవి

Raadhika : నటి రాధిక ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Raadhika : సీనియర్ నటి రాధిక పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడులోని విరుదునగర్ పార్లమెంట్‌ స్థానంను బీజేపీ నటి రాధిక కు ఇవ్వడం జరిగింది. గత కొంత...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

డ్రగ్స్, గంజాయి, ఎర్ర చందనం.! మూడు రాజధానులంటే ఇవా.?

ఒకాయన వైసీపీ అంతర్జాతీయ అధికార ప్రతినిథినంటూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నాడు. యూ ట్యూబ్ ఛానల్ ద్వారా, భలే నవ్వులు పూయిస్తున్నాడు.! జస్ట్ నవ్వులే అనుకునేరు.. అందులో చాలా చాలా విషయం...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...