Naveen Polishetty: ఓ ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్నారు యువ హీరో నవీన్ పోలిశెట్టి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన తన హెల్త్, మూవీ అప్డేట్ ను ఓ ఫన్నీ వీడియోతో షేర్ చేసుకున్నారు. చేతి కట్టుతో ఉండి చిరంజీవి, వెంకటేశ్ సినిమాల్లో క్లిప్పింగులతో చేతి గురించి నవ్వులు పంచారు.
‘సింగిల్ హ్యాండ్.. ఎనీ సెంటర్.. గణేశ్’ అంటూ వెంకటేశ్ చెప్పిన డైలాగ్ చూసి.. తన చేతిని చూసుకుంటూ చానెల్ మార్చాండ్రా అన్నారు. ఆ వెంటనే.. ‘చేయి చూడు ఎంత రఫ్ గా ఉందో..’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ మరోసారి చేయి గురించి కాకుండా వేరే చానెల్స్ పెట్టండ్రా.. అంటూ నవ్వులు పూయించారు.
మరో వీడియోలో ఎడమ చేత్తో చెంపపై కొట్టుకుంటూ చప్పట్లు కొట్టినట్టు చూపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కెరీర్ పరంగా.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. మీ అందరికీ నచ్చేలా కొత్త కథ సిధ్దమైంది. కోలుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు.
View this post on Instagram